జస్ట్ 4 డిజిట్ రెమ్యునరేషన్‌తో కెరీర్‌ స్టార్ట్ చేసిన వెంకీ.. ఇప్పుడు మాత్రం..?

Suma Kallamadi
* 1000 రూపాయలతో కెరీర్ ప్రారంభించిన వెంకటేష్
* ఇప్పుడు కోట్లలో రెమ్యూనరేషన్  
* ఆయన శాలరీ అంతకంతకు పెరుగుతూనే పోతుంది
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
టాలీవుడ్ ఇండస్ట్రీకి నలుగురు హీరోలు పిల్లర్లుగా నిలిచి దాని రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆ నలుగురు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్. వీరందరూ కూడా ఇప్పటికీ సినిమాల్లో హీరోలుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా వెంకటేష్ ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలతో అలరిస్తున్నాడు. ఇటీవల కాలంలో వెంకటేష్ పెద్దగా హిట్స్ సాధించడం లేదు కానీ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హైయ్యెస్ట్ సక్సెస్ రేట్‌తో ఒక వెలుగు వెలిగాడు. 37 ఏళ్ల కెరీర్‌లో కామెడీ, రొమాంటిక్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్, బయోపిక్, అడ్వెంచర్, ఫాంటసీ, హారర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జానర్లలో కూడా సినిమాలు చేస్తూ వెళ్లాడు.
ప్రయోగాత్మక సినిమాలు తీసి ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించడంలో వెంకటేష్ ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈ హీరో కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా మారాడు. 1986 విడుదలైన ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమా కంటే ముందు తన తండ్రి రామానాయుడు నిర్మించిన ప్రేమ్ నగర్ (1971) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ సినిమా 50 ఏళ్ల క్రితమే రూ. 1 కోటి 50 లక్షలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి ముందు రామానాయుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయాడు. దీని తర్వాత ఆయన అప్పులన్నీ తీర్చేసుకుని స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.
అయితే ఈ సినిమాతోనే వెంకటేష్‌ ఫస్ట్ శాలరీ అందుకున్నాడు. ప్రేమ్ నగర్ సినిమాలో నటించినందుకుగాను వెంకటేష్ రూ.1,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే 50 ఏళ్ల క్రితం 1000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. వెంకటేష్ కి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రేమనగర్ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్టు అవసరమయ్యాడు. అప్పుడు రామానాయుడు ఎవరినో ఎందుకు మా అబ్బాయినే తీసుకోండి అని డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ రావుకి తెలియజేశారు. తర్వాత వెంకటేష్ ని అడిగితే ఈ సినిమాలో తాను నటించడానికి సిద్ధమని చెప్పాడట. 1000 రూపాయలు ఇస్తా అనగానే సంతోష పడి ఓకే చెప్పేసాడట. కేశవ్ వర్మ (యంగర్ వెర్షన్) పాత్రలో వెంకటేష్ కనిపిస్తాడు.
అలా వెయ్యి రూపాయలతో కెరీర్ ప్రారంభించిన ఈ హీరో ఇప్పుడు కొన్ని కోట్లలో మనీ తీసుకుంటున్నాడు. విశ్వసనీయ వర్గాల ప్రకారం, వెంకటేష్ తన రీసెంట్ రిలీజ్ సైంధవ్‌ మూవీ కోసం రూ.17 కోట్లు ఛార్జ్ చేసినట్లు సమాచారం. f3 సినిమాకి రూ.15 కోట్లు పారితోషికం పుచ్చుకున్నాడట. ఈ రేంజ్ లోనే ఆయన ఒక్కో సినిమాకి మనీ ఎర్న్ చేస్తున్నాడని సమాచారం. సీనియర్ హీరోలు ఇంత మొత్తంలో డబ్బు అందుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ హిట్స్ కొట్టలేక పోతున్నాడు కాబట్టి మల్టీస్టారర్ మూవీస్ చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: