ఒక్క సినిమాకు రూ.100 కోట్లే..ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ దండయాత్ర..?
* మొదటి సినిమాకు 50వేల రెమ్యూనరేషన్ తీసుకున్న పవన్
* ప్రస్తుతం రోజుకు ఐదు కోట్ల చొప్పున తీసుకుంటున్నారట
* ఒక్క సినిమా చేస్తే పవన్ కు 100 కోట్లు పక్కా
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఉన్న... మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకత ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. 1996 ఆ సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్... మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాలో అక్కినేని కుటుంబానికి చెందిన అమ్మాయి సుప్రియ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అప్పట్లో బంపర్ విజయాన్ని సాధించడమే కాకుండా కలెక్షన్స్ కూడా బ్రహ్మాండంగా రాబట్టగలిగింది. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.పవన్ కళ్యాణ్ తొలి సంపాదన ఇదే. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా చిరంజీవి భార్య కు ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి బద్రి, తమ్ముడు, లాంటి ఎన్నో సినిమాలు చేసి పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగారు.
అయితే హీరోగా ఎదిగిన సమయంలోనే పవన్ కళ్యాణ్ సమాజ సేవకు విపరీతంగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ బిరుదు కూడా అందుకున్నారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి కంటే ఎక్కువ ఫ్యాన్స్ అలాగే క్రేజ్ కూడా సంపాదించుకోగలిగారు తమ్ముడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి.. కొత్త పార్టీ పెట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా కాగలిగారు.
అయితే అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక.. రెమ్యూనరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన రెమ్యూనరేషన్ ఒక్క సినిమాకు 100 కోట్ల వరకు ఉంటుందట. బ్రో లాంటి సినిమాకే.. ఒక్క రోజుకు నాలుగు కోట్ల వరకు తీసుకున్నాడట. అంటే దాదాపు ఈ సినిమాకు 50 కోట్ల సంపాదించాడట పవన్ కళ్యాణ్. ఇక రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగానే.. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా కలెక్షన్స్ రాబడతాయి.