దేవర: ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఆ మీడియా పై ఫ్యాన్స్ ఫైర్..!

Divya
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు నిన్నటి రోజున దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూశారు. అభిమానుల కోసమే దేవర చిత్రం నుంచి సెకండ్ ట్రైలర్ను కూడా నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. పాన్ ఇండియా లెవల్లో కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగులో నటిస్తూ ఉండడంతో ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడానికి తెలుగు కూడా నేర్చుకున్నట్లు ఒక వీడియో వైరల్ గా మారుతోంది. అలాంటి సమయంలోనే ఒక్కసారిగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అని తెలియడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు.

దేవర సినిమాకి సంబంధించి అటు పలు భాషలలో స్పెషల్ ప్రమోషన్స్ తో బాగానే హడావిడి చేస్తున్నారు. తెలుగులో గ్రాండ్ గా నిన్నటి రోజున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినప్పటికీ క్యాన్సిల్ అయింది. హైదరాబాదులో హైటెక్స్ లో నోవాటెల్ లో ఇది చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారట.కానీ అక్కడికి కేవలం 5000 మంది మాత్రమే రావాల్సి ఉండగా పరిమితి నుంచి రావడంతో చాలా గందలగోళం ఏర్పడిందట. సుమారుగా 15000 మంది అభిమానులు అక్కడికి రావడంతో పోలీసులు వారిని నివారించలేకపోయారట. అలా దేవర ఈవెంట్ ని రద్దు చేయబోతున్నట్లు ఆర్గనైజేషన్ వారు తెలియజేశారు.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు శ్రేయస్ మీడియా వారి పైన ఫైర్ అవుతూ.. ఒక స్టార్ హీరో అభిమానులు ప్రీ రిలీజ్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా.. సెక్యూరిటీ ఎలా ఉంచాలో తెలియదా ఎన్నో ఆశలు పెట్టుకొని ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ అభిమాన హీరో అని చూడడానికి వస్తే ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల అభిమానులకు ఇబ్బంది కలగదా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి అభిమానుల విషయంపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.

కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నిన్నటి రోజున అభిమానుల కోసం ప్రత్యేకించి ఒక వీడియోను విడుదల చేసి.. దేవర సినిమా రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం తనకి కూడా చాలా బాధగా ఉందని అభిమానులతో తాను కూడా ఎక్కువ సమయాన్ని గడపాలని తపన పడే వ్యక్తిగా ఒక వీడియోని విడుదల చేయడమే కాకుండా అందులో కేవలం ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఆర్గనైజేషన్ ను బ్లేమ్ చేయడం కూడా తప్పని వెల్లడించారు.. అలాగే అభిమానుల గురించి తెలియజేస్తూ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: