లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.14 రోజులు ఆయనను రిమాండ్ కు తరలించారు. అయితే జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నట్టు నార్సింగి పోలీసులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కి బెయిల్ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అయితే ఈ విషయం గురించి తాజాగా సీనియర్ జర్నలిస్టు దాము బాలాజీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడంలో అస్సలు తప్పులేదు. ఎందుకంటే అసలు ఈ నేరం ఇంకా రుజువు కాలేదు. అలాగే అల్లు అర్జున్ తన సినిమాలో నటించిన కేశవాకి బెయిల్ ఇప్పించి తన సినిమా షూట్ చేయించుకున్నారు. అంతేకాదు కేశవ ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన నేరం రుజువైంది.నేరం రుజువైన వ్యక్తినే అల్లు అర్జున్ బెయిల్ ఇచ్చి బయటికి తీసుకువచ్చి మూవీ షూట్ చేసుకున్నారు.
అలాంటిది పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కి బెయిల్ ఇప్పించకపోతే ఎలా.. ఒకవేళ జానీ మాస్టర్ కి ఆయన సపోర్ట్ గా నిలవకుండా బెయిల్ ఇప్పించకపోతే తప్పు కానీ బెయిల్ ఇప్పిస్తే ఎలాంటి తప్పులేదు.ఎందుకంటే నేరం ఇంకా రుజువు కాలేదు. ఇక ఆ అమ్మాయికి సపోర్ట్ గా నిలిచే వారికి కూడా ఎక్కడో కాస్త తేడా కొడుతుంది.ఎందుకంటే ఆరు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడే ఎందుకు బయటికి వచ్చింది అని చాలామందిలో కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసినా కూడా బెయిల్ మీద పవన్ కళ్యాణ్ బయటకు తీసుకురావచ్చు. అలాగే రీసెంట్ గా ఎమ్మెల్యే ఆదిమూలం ది వీడియోతో సహా బయటపడ్డప్పటికీ కోర్టు బయట వీరి మేటర్ సెటిల్ అయింది.
అలాగే వీరి మధ్య ఉన్న ఇష్యూ ని కూడా కోర్టు బయటే సెటిల్ చేసుకోవచ్చు అంటూ సీనియర్ జర్నలిస్టు దాము బాలాజీ సంచలన కామెంట్స్ చేశారు. మరి జానీ మాస్టర్ కి పవన్ కళ్యాణ్ సహాయం చేస్తారా.. బెయిల్ ఇప్పించి బయటికి తీసుకు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఇండస్ట్రీలోని పెద్దలందరికీ అలాగే డాన్సర్ అసోసియేషన్ వాళ్ళందర్నీ కలిసి జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడి ఇండస్ట్రీ పెద్దలందరూ జానీ మాస్టర్ కి మద్దతు ఇవ్వాలని కోరబోతున్నట్టు తెలుస్తుంది.మరి చూడాలి జానీ మాస్టర్ కథ ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో