యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకోలేదు.
ఈ సినిమా ట్రైలర్ గతంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమాకు చాలా దగ్గరగా ఉంది అని , అందులోని కొన్ని షాట్స్ ఇందులోని కొన్ని షాట్స్ సమానంగా ఉన్నాయి అని కొంత మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మూవీ యూనిట్ భారీ ఎత్తున ప్రచారాలను చేసి కాస్త ఆ నెగెటివిటీని తగ్గించినా కూడా ఎంతో కొంత పర్సంటేజ్ లో ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి జనాల్లో కాస్త నెగిటివ్ బజ్ నడుస్తూనే ఉంది. మరో ట్రైలర్ తోనే ఈ మూవీ యూనిట్ ఆ నెగిటివ్ తక్ ను పోగొట్టాలి అనుకున్నారో ఏమో తెలీదు కానీ ఈ సినిమా విడుదలకు చాలా తక్కువ రోజుల ముందు అనగా ఈ రోజు ఈ మూవీ నుండి రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ ను మూవీ విడుదల చేసింది.
ఈ ట్రైలర్ దాదాపు రెండు నిమిషాల కంటే ఎక్కువ నిడివితో ఉంది. ఇందులో మాత్రం చాలా ఫ్రెష్ షాట్స్ ఉన్నాయి. దానితో ఇంత కాలం పాటు దేవర సినిమాపై నెగటివ్ ట్రోల్ చేసిన వారు కూడా పాజిటివ్ గా ఈ సినిమా ట్రైలర్ పై స్పందించే అవకాశాలు ఉన్నాయి. అలా దేవర యూనిట్ ఎక్కడ కూడా నెగటివ్ స్ప్రెడ్ కాకుండా చాలా అద్భుతంగా ఈ సినిమా ప్రచారాలను సాగిస్తుంది.