ఫ్యాన్స్‌కు గ‌ట్టి షాక్ ఇస్తోన్న ప్ర‌భాస్‌... ఎవ్వ‌రూ ఊహించ‌లేరు..?

RAMAKRISHNA S.S.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాస్ ఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు. వరస సినిమాలతో నార్త్ హీరోలకు చెమటలు పట్టిస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలలో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ మారుతితోో రాజా సాబ్, హను రాఘవపూడి తో ఫౌజీ ఈ చిత్రాల తర్వాత అతని దృష్టి ఈ రెండు సీక్వెల్స్ పైనే ఉంటుందని ప్రభాస్ సన్నిహిత వర్గాల నుంచే అందుతున్న సమాచారం. అయితే వాటిలో కల్కి2989AD వచ్చే సంవత్సరం మొదలుపెట్టిన దీన్ని కంప్లీట్ చేసి 2028చేసి 2028 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని వార్త  టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగాా వినిపిస్తుంది. అయితే ఇది నిజమా? ప్ర‌భాస్ అభిమానులు అంత కాలం వేచి చూడ‌గ‌ల‌రా? అన్న చ‌ర్చా సాగుతోంది.

ప్రభాస్ కల్కి సినిమా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీన్ని సీక్వెల్ని వేడి మీద ఉన్నప్పుడే ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని  అభిమానులు, ట్రేడ్ పండితులు కోరుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ అందుకు భిన్నంగా కల్కిెల్ను మూడేళ్ల తర్వాత ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఎవరికీ తెలియదు.

అదేవిధంగా ఈ మూవీ సిక్వెల్ స్టోరీ కూడా మారిందని, అతీతంగా ఈ మూవీ టైటిల్ కూడా మారిపోతుందనిదని వార్త కూడా ఒకటి టాలీవుడ్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తుంది. కల్కి2898AD నుంచి కర్ణ3102BCగా మారబోతుందని అంటున్నారు. కర్ణుడు, అశ్వద్ధామ చుట్టూ నడిచే కథను దర్శకుడు తెరపై చూపించబోతున్నాడు.మ‌ధ్య‌లో విల‌న్ యాస్కిన్ ప్ర‌వేశిస్తాడ‌ని చెబుతున్నారు. యాస్కిన్‌గా క‌మ‌ల్ హాస‌న్ పాత్రను అత్యుత్త‌మంగా తీర్చిదిద్దుతున్నార‌ని కూడా తెలుస్తోంది.

బీసీ లో చెప్పే క‌థ అంటే మ‌హాభార‌త యుద్ధం త‌ర్వాత ఏం జ‌రిగింద‌నే క‌థ‌ను తెర‌పై చూపిస్తార‌ట‌. అయితే వీట‌న్నిటికీ అధికారికంగా నిర్ధార‌ణ రావాల్సి ఉంది. ఓవైపు తెలుగు మీడియాలో ఇలాంటి ప్ర‌చారం సాగుతుంటే, క‌ల్కి సీక్వెల్ క‌థను కొన్ని యూట్యూబ్ చానెళ్లు లీక్ చేసేయ‌డం వింత‌గా అనిపిస్తోంది. క‌ల్కి 2989 ఏడితో పాటు ప్ర‌భాస్ స‌లార్ సీక్వెల్ సినిమాలోను న‌టించాల్సి ఉంది. స‌లార్ బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించింది. పార్ట్ 2 ని గ్రాండ్ గా తెర‌కెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ కాల్షీట్ల‌ను స‌ర్ధుబాటు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: