జానీ మాస్టర్ ఆ అమ్మాయితో గొడవపడితే, సుకుమార్ సెటిల్ చేశాడు: మాధవీలత
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం చుట్టూనే తిరుగుతోంది. రేప్ కేసు విషయంలో అతడిని వ్యతిరేకించే వారు కొంతమంది అయితే, మద్దతిచ్చేవారు మరికొంత మంది తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికలుగా చేసుకొని మాట్లాడుతున్నారు. మద్దతిచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు ముందున్నారు. అయితే ఆయన మద్దతివ్వడం కాదుగానీ, విచారణ చేయకుండా అనవసరంగా మాట్లాడకూడదు అని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే విషయం పైన జానీ మాస్టర్ తీరుపై నటి, బీజేపీ నేత మాధవిలత సైట్ నిప్పులు చెరిగారు. నాగబాబు గారు ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే ఈ విషయంపైన నటి మాధవీలత సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసారు. జానీ మాస్టర్ మంచి వాడు కావొచ్చు కానీ, ఆ అమ్మాయి విషయంలో మాత్రం అతడు మంచి వ్యక్తి కాదని ఆమె చెబుతున్నపుడు మనం వినాలి కదా? మరోవైపు అతడు చేసిన నేరం అంగీకరించినట్లు కూడా రిమాండ్ రిపోర్టులో ఉంది. ఆ అమ్మాయి 16 లేదా 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి రాగా జానీ మాయ మాటలు నమ్మి తనతో 6 నెలలు రిలేషన్ మెంటైన్ చేసింది. తర్వాత నిజం తెలుసుకుని బయటకు వచ్చేసింది. స్వతంత్రంగా పనిచేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు అమ్మాయి టీనేజర్. ఇపుడు ఆమె ఇండిపెండెంట్ గా పనిచేయడం మొదలు పెడుతోంది. ఈ విషయం జానీకి మాస్టర్ కి నచ్చడం లేదు.. అందుకే ఇలా ఆమె బయటకొచ్చి మాట్లాడింది! అంటూ.. మాధవీలత మాట్లాడారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'పుష్ప 2' సినిమాకి ఆ అమ్మాయి పనిచేస్తుంటే, జానీ మాస్టర్ అక్కడికి వచ్చి కూడా నానా రభస చేసారు. ఆ సమయంలో సుకుమార్ గారే పంచాయితి పెట్టి ఆ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఆ విషయం అల్లు అర్జున్ కూడా తెలుసు కాబట్టే... అల్లు అర్జున్, సుకుమార్ కూడా ఆ అమ్మాయికి అండగా ఉన్నారు. ఇందులో తప్పేముంది? ఆ తరువాత విశ్వక్ సేన్ సినిమా సైట్లో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఇవన్నీ తెలుసుకుని మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అంటూ పాత విషయాలను మాధవీలత చెప్పుకొచ్చింది... మరి ఈ వీడియోకి నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!