తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ప్రధమంగా ఉంటారు. ఈయన ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈయన ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డుని గెలుపొందింది. ఈ సినిమాతో రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా లభించింది. చాలా సంవత్సరాల క్రితం రాజమౌళి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మగధీర అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో శ్రీహరి ఓ కీలకమైన పాత్రలో నటించగా ఆయనకు ప్రేయసి పాత్రలో సలోని నటించింది. మరి సలోని పాత్ర కోసం మొదట రాజమౌళి అర్చన ను అనుకున్నాడట. ఈ విషయాన్ని అర్చన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ ఇంటర్వ్యూ లో అర్చన మాట్లాడుతూ .. మగధీర సినిమాలో సలోని చేసిన పాత్ర కోసం నన్ను మొదట మూవీ బృందం అప్రోచ్ అయింది. కాకపోతే చిన్న పాత్ర అనే ఉద్దేశంతో నేను ఆ సినిమా చేయను అని చెప్పాను.
ఇక ఆ తర్వాత ఆ మూవీ చేసి ఉంటే బాగుండేది అనుకున్నాను అని అర్చన ఓ ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే మగధీర సినిమా ద్వారా అర్చన కు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మర్యాద రామన్న సినిమాలో సలోని హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా సలోని క్రేజ్ తెలుగులో మరింత పెరిగింది.