జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవర. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అదే హైప్ కొనసాగుతూ ఉంది.జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దేవర. సెప్టెంబర్ 27న థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా అదే హైప్ కొనసాగుతూ ఉంది.ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న చిత్రం కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆరు సంవత్సరాల క్రితం అరవింద సమేతలో నటించారు. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ తో కలిసి చేశారు. దేవరకు కొరటాల శివ దర్శకుడు. దీనికి ముందు శివ చేసిన ఆచార్య ఫ్లాప్ కావడంతో యంగ్ టైగర్ అభిమానులను ఈ విషయం భయపెడుతోంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించారు.ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ఉంటాయా? టికెట్ రేట్లు పెరుగుతాయా అని చర్చ జరుగుతుండగా వాటిపై క్లారిటీ ఇచ్చేసారు.
గతంలో ఏపీలో బెనిఫిట్ షోలు, అర్ధరాత్రి షోలకు పర్మిషన్ తీసేసిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో ‘దేవర’ టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీన్ని బట్టి ఏపీలో ‘దేవర’ భారీ ఓపెనింగ్స్ కొట్టడం ఖాయం అన్నది ఫిక్స్ అయింది.ఇదిలావుండగా సెప్టెంబర్ 27వ తేదీన అర్థరాత్రి 12 గంటల నుంచి ఆరు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అంటే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న థియేటర్లు అన్నిటిలో వేసుకోవచ్చన్న మాట. 28వ తేదీ నుంచి తొమ్మిది రోజుల పాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు ఐదు ఆటలకు అనుమతి వచ్చింది.ఈ నేపథ్యంలో ‘దేవర’ టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునేందుకు అనుమతి వచ్చింది. మల్టీఫ్లెక్స్‌ల్లో ఏకంగా రూ.135 పెంచుకునేందుకు చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
ఏపీలో ప్రస్తుతం మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర రూ.177 వరకు ఉంది. అంటే మల్టీఫ్లెక్స్‌లో దేవర టికెట్ రేట్ రూ.312 వరకు ఉండనుందన్న మాట. ఇక సింగిల్ స్క్రీన్లలో అప్పర్ క్లాస్‌కు రూ.110, లోయర్ క్లాస్‌కు రూ.60 వరకు పెంపునకు అనుమతి ఇచ్చారు. కాబట్టి సింగిల్ స్క్రీన్లలో కూడా ‘దేవర’ టికెట్ ధర రూ.200 దాటిపోనుంది. మొదటి 14 రోజుల వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. పెంపునకు అనుమతులు భారీగా వచ్చాయి, జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా ఆరు సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ‘దేవర’ ఏపీలో భారీ ఓపెనింగ్స్ కొట్టే అవకాశం ఉంది.ఇదిలావుండగా దేవర మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ముహూర్తం దగ్గర పడుతుంది. దీనితో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ ఈవెంట్ ను సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవొటెల్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.