పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ రీసెంట్‌గా ‘కల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ
సినిమా విజయం తరువాత ఆయన ఇప్పుడు తన నెక్స్ట్
మూవీ ‘ది
రాజా సాబ్’తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ
సినిమా రిలీజ్ కాకముందే, మరో ప్రాజెక్టును కూడా
ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రజా సాబ్ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తవుతుండగా ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అలాగే ఫస్ట్ లుక్స్
పోస్టర్ లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా ఈ చిత్రం తాలూకా టీజర్ ఈ
అక్టోబర్ 23
ప్రభాస్ బర్త్ డే కానుకగా తీసుకొస్తున్నారు అంటూ ఇపుడు నుంచే వార్తలు కొన్ని వైరల్ గా మారాయి.
అయితే దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇవి అన్నీ అవాస్తం అంటూ మారుతీ ఫ్రెండ్, మన
టాలీవుడ్ యువ
ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ కన్ఫర్మ్ చేసేసారు. సో
ప్రభాస్ బర్త్ డే కి
రాజా సాబ్ టీజర్ వస్తుంది అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. మరోవైపు
సందీప్ వంగ దర్శకత్వంలో ఇప్పటికే కమిట్ అయిన 'స్పిరిట్'
సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. సందీప్
సినిమా ప్రారంభంకు ముందే
రాజా సాబ్
సినిమా ముగించాలని
ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రస్తుతం స్పిరిట్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దర్శకుడు సందీప్ వంగ తన టీం తో కలిసి
ముంబై లో జరుపుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి
అయింది. డైలాగ్ వర్షన్ ను రాస్తున్నట్లుగా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో
సందీప్ వంగ చెప్పుకొచ్చాడు. మరో వైపు నటీ నటుల ఎంపిక, సెట్స్ డిజైన్, హీరో, హీరోయిన్ ల లుక్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న తాజా సమాచారం ప్రకారం 'స్పిరిట్' లో ప్రభాస్ ను ఎలా చూపించాలి అనే విషయమై దర్శకుడు సందీప్ వంగ ఒక క్లారిటీకి వచ్చాడట. టెక్నాలజీని ఉపయోగించి దాదాపు వారం రోజుల పాటు వర్కౌట్స్ చేసి
ప్రభాస్ స్పిరిట్ లో ఎలా అయితే బాగుంటుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడట. సినిమాలో ప్రభాస్ లుక్ కి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఫిదా అయ్యేలా దర్శకుడు సందీప్ వంగ డిజైన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది...!!