ఘనంగా ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు... ముఖ్య అతిధి స్థానంలో వియన్ ఆదిత్య!

Suma Kallamadi
అక్కినేని వారసుడు కింగ్ నాగార్జున ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలను హైదరాబాదులో అతిరథ మహారథులు మధ్య కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు... మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదలగువారు సోషల్ మీడియా ద్వారా విష్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న సాయంత్రం మొదలైన ఈ శత జయంతి వేడుకలు నిరాటంకంగా కొనసాగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు సీనియర్ దర్శకుడు, నిర్మాత అయినటువంటి విఎన్ ఆదిత్య ఈ శతజయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా రాబోతున్నట్లు సమాచారం.
ఏఎన్ఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 80వ దశంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారు తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్ని రకాలుగా మేలు చేశారు అనేది మాటల్లో చెప్పడానికి వీలుకానిది. నందమూరి తారక రామారావు గారు పౌరాణిక పాత్రలో వేయడంలో తన మార్క్ చూపిస్తే... సాంఘిక పాత్రలు వేయడంలో అక్కినేని వారిది అందవేసిన చేయి అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా వేరు తెలుగు సినిమా పరిశ్రమకి దశ నిర్దేశం చేశారు. ఇప్పుడు వారి బాటలోనే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి వారు తెలుగు పరిశ్రమకు ఎనలేని కృషి చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక వీరి పరంపరను తరువాత తరం వారు కొనసాగిస్తూ వస్తున్నారు. అక్కినేని నాగార్జున తర్వాత.. వారి వారసులు అయినటువంటి నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కలిసి తాత వారసత్వాన్ని ముందుకి తీసుకెళ్తున్నారు.

ఇక హైడ్రా ఆపరేషన్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, అక్కినేని నాగార్జున కు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని పడగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగా, అక్కినేని నాగేశ్వరరావు గారు శతజయంతి ఉత్సవాలను నాగార్జున ఎంతో హట్టహాసంగా షురూ చేశారు. వాస్తవానికి ఈ వేడుకలు ఎన్ కన్వెన్షన్ హాల్ లోనే జరగాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తు దానిని పడగొట్టడంతో వేరేచోట అక్కినేని వారి ఉత్సవాలను జరుపుతున్నారు. నిన్న మొదలైన ఈ ఉత్సవాలు... ఎందరో సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల మధ్య నేటికీ ఇంకా జరుగుతూ వస్తున్నాయి. ఈ వేదికపై అక్కినేని నాగార్జున కుటుంబం కొంతమంది సీనియర్ సినిమా ప్రముఖులకు సన్మానం చేయనుంది. ఈ సందర్భంగా తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేసిన వారికి అక్కినేని పేరిట అవార్డులు కూడా ఇవ్వనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: