చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. ప్రేక్షకులకు కూడా బంపరాఫర్..?
2024గానూ "ఏఎన్నార్ నేషనల్ అవార్డు"ను చిరుకి ఇవ్వనున్నట్టు నాగార్జున అనౌన్స్ చేశారు. అక్టోబరు 28న ఆ పురస్కారం అందజేస్తానని తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నారు. తండ్రి ఏఎన్నార్ శత జయంతిని ఆర్కే సినీ ప్లెక్స్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ తన నాన్న నవ్వుతూనే తమకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పించారని చెప్పారు. ఈ వేడుకలో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరయ్యారు. దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీ మోహన్ కూడా పార్టిసిపేట్ చేశారు.
''నాన్న పేరు తలచుకుంటేనే మా ముఖాలపై చిరునవ్వులు చెందుతాయి. ఆయన నటించిన సినిమాలు మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నవంబరులో 'ఇఫి' వేడుక నిర్వహించనున్నారు. అందులో నాన్న మూవీ జర్నీని ఒక వీడియో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. మా నాన్న జయంతి సందర్భంగా చాలామంది అభిమానులు రక్తదానం చేశారు, ఆశ్రమాల్లో వృద్ధులకు భోజనం పెట్టారు. మీ ఆదరణ చూస్తుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. ఏఎన్నార్ అవార్డు ఇవ్వనున్నామని చెప్పగానే చిరంజీవికి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. దీనికంటే పెద్ద అవార్డు ఏదీ లేదని అన్నారు'' అని నాగార్జున చెప్పుకొచ్చారు.
ఇక రాఘవేంద్రరావు మాట్లాడుతూ అక్కినేని, తమ కుటుంబాలు వేరు కాదని పేర్కొన్నారు. రాఘవేంద్రరావు అన్నారు. హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ను ప్రారంభించి లక్షల మందికి ఏఎన్నార్ ఉద్యోగాలు ఇచ్చారని కూడా ప్రశంసించారు. నాగేశ్వరరావు- నాగార్జున ఇద్దరితో కలిసి పనిచేయడం తన అదృష్టం అని అన్నారు.
'శ్రీరామదాసు'లో తండ్రీకొడుకులు ఒకరికొకరు నమస్కారం చేసుకునే సీన్ వెనుక ఉన్న ఒక స్టోరీ కూడా అందరితో షేర్ చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే తాను ఏఎన్నార్‌కు బిగ్ ఫ్యాన్ అని సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ అన్నారు. నాగేశ్వరరావు- సావిత్రి కాంబోలో వచ్చిన సినిమాలను మొదటి రోజే చూసే వాడినని కనీసం ఆ మూవీలను నాలుగైదు సార్లు చూసే వాడినని తెలిపారు. అక్కినేని ఆటోగ్రాఫ్ అయినా తీసుకోగలనా అని తాను అనుకున్నానని కానీ ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించే అదృష్టం దక్కిందని పేర్కొన్నారు.
* ఏఎన్నార్ పోస్టల్ స్టాంప్ అన్వీల్డ్
ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా తపాలా శాఖ ఓ స్టాంప్ రిలీజ్ చేసింది. వేడుకలో ఇండియా పోస్టల్ సర్వీసెస్ చీఫ్ పోస్ట్ మాస్టర్ ఇన్ జనరల్ (తెలంగాణ) డా.పీవీయస్ రెడ్డి ఏఎన్నార్ స్టాంపు ఆవిష్కరించారు. దివంగత దర్శకుడు బాపు గీసిన చిత్రంతోనే ఈ స్టాంప్‌ను ముద్రించడం విశేషం.
* ఫ్యాన్స్ గిఫ్ట్
అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఏఎన్నార్ విగ్రహానికి నాగార్జున నివాళులు అర్పించారు. ఆ తర్వాత నాగార్జున కుటుంబ సభ్యులు ఫ్యాన్స్‌తో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా 600 వందల మంది ఫ్యాన్స్‌కు ఫ్రీగా వస్త్రాలు అందజేశారు.
* ఫ్రీగా సినిమా చూసే ఛాన్స్
సెప్టెంబర్ 20 నుంచి ఆదివారం వరకు 31 నగరాల్లో ఏఎన్నార్ 10 సినిమాలు ఫ్రీగా చూసేలా ప్రేక్షకులందరికీ అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. 'దేవదాసు' 4K స్క్రీనింగ్‌తో ఏఎన్నార్ ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది.