మాడా గురించి ఈ తరం సినీ లవర్స్‌కు తెలియని టాప్ సీక్రెట్లు...!
- చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
మాడా.. గురించి... తెలుగు తెరపై తెలిసినంతగా.. తెరవెనుక తెలియక పోవడం గమనార్హం. మాడా.. అసలు పేరు వెంకటేశ్వరరావు. చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా తీస్తున్న సమయంలో ఈయన ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు. సినిమాలో పేరు కూడా ఉంటుంది. అయితే.. అనూహ్యంగా ఆయనకు ఈ సినిమాలో పాత్ర దక్కింది. దర్శకుడు దాసరి నారాయణరావుకు ఒక చిత్రమైన లక్షణం ఉంది. ఆయన ఆర్టిస్టుల కోసం వెతుకుతారు.
అయితే.. ఎంతకీ ఎవరూ దొరకకపోతే.. చివరకు తన దగ్గర పనిచేస్తున్నవారిలో ఒకరిద్దరిలో ఉన్న టాలెం ట్‌ను పసిగట్టి.. అరెయ్ నువ్వే ఈ వేషం వేస్తున్నావ్! అని చెప్పేవారు. ఇలా.. అనేక మంది దర్శకరత్న దగ్గర పనిచేసిన టెక్నీషియన్స్.. తర్వాత కాలంలో దర్శకులు.. నటులుగా కూడా రాణించారు. కోడి రామకృష్ణ దర్శకుడు అనే విషయం తెలిసిందే. కానీ, ఈయన దాసరి వద్ద లైట్‌మెన్ అనేదిచాలా తక్కువ మందికి తెలుసు.
ఇలానే.. మాడా కూడా దర్శకుడు దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. అయితే.. చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమా లో హిజ్రా పాత్ర కీలకం. దాసరి ఈ పాత్ర కోసంచాలా మందిని సంప్రదించారు. కానీ, విషయం తెలిసిన వారు ఎవరూ ముందుకు రాలేదు. అమ్మో తర్వాత.. కెరీర్ దెబ్బతింటే ఎలా అనుకున్నారు. దీంతో ఎంతకీ ఎవరూ దొరకకపోవడంతో.. దాసరి సాహసం చేసి.. అరెయ్ వెంకాయ్..నువ్వే ఏసేయ్‌రా! అన్నారు. అంతే.. గురువుగారు చెప్పారు.. కాదనేది ఏముందని నటించారు.
ఈ సినిమాలో మాడా పాత్రకు ఎనలేని పేరు వచ్చింది. తర్వాత కాలంలో ఈ పేరే నిలిచిపోయింది. ముత్యాలముగ్గు సినిమాలో ఒకే ఒక్క సీన్‌లో కనిపించే మాడా.. సినిమా మొత్తంలో నిలిచిపోయేలా నటించడం గమనార్హం.