పాపం త్రిష..ఆ రాజకీయ నాయకుడి నలిగిపోతోంది?

Veldandi Saikiran
హీరోయిన్ త్రిష గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. నాలుగుపదుల వయసులోనూ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందం, అభినయంతో ప్రేక్షకులను నటనతో ఆకట్టుకుంటుంది. సినీ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్ తో తన ప్రయాణం ప్రారంభించిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. హీరోయిన్ త్రిష జోడి సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ కు ఫ్రెండ్ పాత్రలో నటించింది. అప్పుడు త్రిష ప్రయాణం మొదలైంది.
అనంతరం తమిళంలో హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత వర్షం సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా చేసింది. ఆ సినిమాతో త్రిష కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సినిమా అనంతరం త్రిష వెనుతిరిగి చూసుకోకుండా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించింది. త్రిష లియో సినిమా సక్సెస్ కావడంతో ఈ బ్యూటీకి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం త్రిష చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంటుంది.

రీసెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్, హీరోయిన్ త్రిషకు సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. హీరో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం కూడా జరిగింది. విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చి త్రిషను వివాహం చేసుకుంటాడు అంటూ ఇండస్ట్రీ మొత్తం కోడై కూసింది. ఇదే సమయంలో త్రిష, విజయ్ కోసం అతను నటించిన సినిమాలో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది.
ఇప్పటివరకు త్రిష ఎలాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించలేదు. కానీ విజయ్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ నటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ సినిమాలో త్రిష, విజయ్ సాంగ్ పై ఘోరంగా ట్రోల్స్ వస్తున్నాయి. విజువల్ గా కూడా ఈ సాంగ్ చాలా వరస్ట్ గా ఉందని సినీ అభిమానులు అంటున్నారు. దీంతో త్రిష సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించకూడదని నిర్ణయం తీసుకుందట. మొత్తానికి విజయ్ దెబ్బకు త్రిష ఐటమ్ సాంగ్స్ కు దూరమయ్యారని చర్చ సాగుతోంది. కాగా, విజయ్ ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: