అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు.. వైరల్ అవుతున్న పోస్టర్..!

lakhmi saranya
సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో దాదాసా హెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సెప్టెంబర్ 20,1924 - సెప్టెంబర్ 20,2024 సందర్భంగా "నటసామ్రాట్ అక్కినేని నట జీవితం - వివిధ కోణాలలో " అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.
 అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం... అక్కినేని నాగేశ్వరరావు తో తనకు ఉన్న ప్రత్యేక అనుభవాన్ని, ఆయన జీవన ప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించి, ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికి ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేనితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధం ఉన్న ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు అక్కినేని అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు. ప్రముఖ గాయని, ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరి అక్కినేని సమక్షంలో పాటలు పాడి ఆశీస్సులు పొందగల్గడం తన అదృష్టం అన్నారు.
 ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల అక్కినేని జ్ఞాపకశక్తి, ఆత్మీయ పలకరింపులను గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ... డా. అక్కినేని నటన జీవితం ఎంత ముఖ్యమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంతా విశిష్ట మైనది. ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది అన్నారు. అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న - జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ గీతరచయిత , తెలుగు వేదికవి - " అక్కినేని తో ముచ్చట్లు", డా. వి. ఎన్ ఆదిత్య, ప్రముఖ సినీ దర్శకులు,రచయిత, నిర్మాత - "జానపద కథానాయకుడు అక్కినేని " , ఎస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: