పేరుకు స్టార్ హీరో.. కానీ అలాంటి పనులు చేస్తుంటాడు.. తారక్ సింప్లిసిటీ గురించి కొరటాల..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుల లో కొరటాల శివ ఒకరు . ఈయన కెరియర్ ప్రారంభం లో చాలా సినిమాలకు కథ రచయిత గా పని చేసే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు . ఆ తర్వాత ఈయన మిర్చి మూవీ తో దర్శకుడుగా కెరియర్ను ప్రారంభించాడు . ఈయన దర్శకుడి గా కెరియర్ను ప్రారంభించిన తర్వాత వరుస విజయాలను అందుకుంటు చాలా తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు . ఆఖరుగా ఈయన ఆచార్య మూవీకి దర్శకత్వం వహించాడు . ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది . తాజాగా కొరటాల , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమాను రూపొందించాడు.

మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం వారు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా కొరటాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ... జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో ఆయన అలా ఉంటాడు, ఇలా ఉంటాడు.

ఆయన లైఫ్ ఎంతో గొప్పగా ఉంటుంది అని మనం ఊహించుకుంటూ ఉంటాం. అలా ఊహించుకొని ఆయన ఇంటిలోకి వెళితే ఆయన సరదాగా కిచెన్ లో ఉండి ఏదో ఒక వంట వండుతూ ఉంటాడు. దానిని చూసిన తర్వాత ఈయన ఇంత సాధారణంగా ఉన్నాడు ఏంటి అనే అనుమానాలు మనలో వ్యక్తం అవుతూ ఉంటాయి. అంత గొప్ప స్టార్ అయిన చాలా చిన్న స్థాయి వ్యక్తులా జీవిస్తూ ఉంటాడు అని కొరటాల తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: