టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో
ప్రభాస్ , మహేష్ ముందు వరసలో ఉంటారు అని చెప్పడంలో పెద్దగా వెనకాడాల్సిన పనిలేదు. ఇక
ప్రభాస్ ఇప్పటికే అనేక పాన్
ఇండియా సినిమాలలో హీరోగా నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మహేష్ ఇప్పటివరకు తెలుగు సినిమాలను తప్ప ఇతర భాష సినిమాలు చేయలేదు. దానితో మహేష్
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. తన తదుపరి
మూవీ ని మహేష్ బాబు , రాజమౌళితో చేయబోతున్నాడు.
ఈ సినిమాను పాన్ వరల్డ్
మూవీ గా రూపొందించనున్నారు. ఇక ఈ సినిమాతో ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. మహేష్ కి మొదటి సూపర్ సాలిడ్ విజయం ఒక్కడు
మూవీ తో వచ్చింది. ఈ
మూవీ లో
భూమిక చావ్లా హీరోయిన్గా నటించగా ,
గుణశేఖర్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
మణిశర్మ ఈ
మూవీ కి సంగీతం అందించాడు. ఈ
మూవీ ద్వారా మహేష్ కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ మూవీతో స్టార్ హీరోగా మారిపోయాడు. మరి
ప్రభాస్ వల్ల మహేష్ ఎలా స్టార్
హీరో అయ్యాడు అనుకుంటున్నారా ..? అదేమీ లేదు... అసలు ఒక్కడు
సినిమా అవకాశం మొదట
ప్రభాస్ కే వచ్చింది. ఆయన రిజెక్ట్ చేయడం తోనే మహేష్ కు ఈ ఆఫర్ వెళ్ళింది. దానితో ఈయన స్టార్
హీరో అయ్యాడు.
అసలు విషయం లోకి వెళితే ...
గుణశేఖర్ మొదట ఒకడు
సినిమా కథను
ప్రభాస్ తో చేయాలి అని కృష్ణం రాజు కు కథ ను కూడా వినిపించాడట. ఆయనకు మొదట కథ బాగా నచ్చినప్పటికీ ఆ తరువాత ఇలాంటి కథ రిస్క్ ఏమో అని వద్దన్నాడట. ఆ తర్వాత మహేష్ ను
గుణశేఖర్ సంప్రదించడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఇక చివరిగా మహేష్ తో ఒక్కడు
మూవీ ని రూపొందించగా ఆ
మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మహేష్ స్టార్
హీరో అయిపోయాడు.