వచ్చే సంక్రాంతికి ఏకంగా ఆరు సినిమాలు.. ఈసారి బాక్స్ ఆఫీస్ వార్ అదిరిపోనుందా..?

MADDIBOINA AJAY KUMAR
సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం మొదలవుతూ ఉంటుంది . వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం కనబడే అవకాశం ఉంది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు ఏకంగా ఆరు క్రేజీ సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక తమిళ నటుడు అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లి అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక బాలయ్య , బాబి కాంబోలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో దింపడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండేల్ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం. యువ నటుడు సందీప్ కిషన్ ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే ఈ ఆరు సినిమాలో వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: