రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా అలా ఉండబోతోందట!

praveen
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగాస్టార్ తనయుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ గా మారడానికి చాలా ఏళ్లు పట్టింది. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన రంగస్థలం సినిమాతోనే రామ్ చరణ్ తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో చేసిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా అవతరించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలోనే గేమ్ చేంజర్ సినిమా చేయగా, ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాంతో ఈ సినిమా పైన మెగా అభిమానులకు తారస్థాయి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రస్తుతం చరణ్ బాబు యూకే లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శ్రీకాకుళం మహాబలి కోడు రామకృష్ణ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఉత్తరాంధ్రలోని పుట్టిన ఏకైక మల్ల యోధుడు ఇతడు. ఈయన జీవితాంశాన్ని కథా వస్తువుగా ఎంచుకొని దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ పది పలకల దేహంతో ప్రేక్షకులను అలరించనున్నారని టాక్ వినబడుతోంది. అంతేకాకుండా ఈ మల్లయోధుని ప్రతిభ సినిమా మొత్తం కవర్ చేసేలా బుచ్చిబాబు కసరత్తులు చేస్తున్నాడని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమా తో రామ్ చరణ్ ప్రపంచస్థాయి నటుడు కాబోతున్నాడని మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: