పెళ్లికి ముందే ఆ హీరోయిన్ తో మహేష్ బాబు రహస్య బంధం.?

Pandrala Sravanthi
మహేష్ బాబుపై ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీ కూడా లేదు. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న రూమర్స్ వినిపించినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం ఒక సంచలన విషయాన్ని బయట పెట్టింది.పెళ్లి కాకముందు సినిమాల్లోకి మహేష్ రాకముందే నాకు తెలుసు.మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉంది అంటూ ఒక షాకింగ్ విషయం బయట పెట్టింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది చూస్తే ఆమె ఎవరో కాదు గోవా చిన్నది త్రిష కృష్ణన్.. గతంలోనే మహేష్ బాబుకి త్రిషకి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని, ఆ విషయం తెలిసే నమ్రత మహేష్ బాబుని హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనే రూమర్ వినిపించింది. అయితే మహేష్ బాబుతో కలిసి  త్రిష అతడు, సైనికుడు వంటి రెండు సినిమాల్లో నటించింది. ఇక అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ సైనికుడు సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై పెద్ద డిజాస్టర్ అయింది.

అయితే మహేష్ బాబు గురించి త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు మహేష్ సినిమాలోకి రాకముందే తెలుసు. ఎందుకంటే మహేష్ కాలేజీ రోజులు అన్ని చెన్నైలోనే గడిచాయి. అలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నాకు మహేష్ పరిచయమయ్యారు.అయితే ఇద్దరి మధ్య అంతా రిలేషన్ అయితే లేదు. కేవలం హాయ్ బాయ్ అనేంత రిలేషన్ మాత్రమే ఉంది. అయితే ఆ టైంలో మేమిద్దరం నటీనటులం  అవుతామనే సంగతి మాకు కూడా తెలియదు. ఇక మహేష్ బాబు తో నేను రెండు సినిమాల్లో నటించాను.అలాగే మహేష్ బాబు ప్రతి ఒక్కరూ నటించే సీన్ ని మానిటర్ ముందు ఉండి చూస్తారు.

ఆయన షూటింగ్ సెట్లో చాలా కష్టపడతారు. కనీసం బ్రేక్ తీసుకొని కేరావాన్ లో కూడా కూర్చోరు.. షూటింగ్ సెట్ కి వస్తే హార్డ్ వర్క్ ఒక్కటే ఆయనకు తెలుసు. షూటింగ్ సెట్ కి ఎప్పుడో ఉదయం 7 గంటలకు వస్తే మళ్ళీ పదింటి వరకు ఆయన పని చేస్తూనే ఉంటారు.ఇక మహేష్ బాబు తో నేను నటించే సమయంలో ఆయన హార్డ్ వర్క్ చూసి నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఇండస్ట్రీలో నా ఫేవరెట్ హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరు. ఆయన అంత పెద్ద హీరో అయినా కానీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. మహేష్ బాబుతో సినిమాలో నటించిన సమయంలో నేను చాలా కంఫర్ట్ గా భావించాను అంటూ త్రిష ఎవరికి తెలియని ఒక సీక్రెట్ విషయాన్ని బయట పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: