అనిల్ రావిపూడి ఎంతో ఇష్టంగా రాసుకున్న పాత్రను వేరే నటుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించాడు. అలా కెరియర్ ప్రారంభంలో అనిల్ రావిపూడి , రామ్ పోతినేని హీరోగా రూపొందిన కందిరీగ సినిమాకు కథను అందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ కందిరీగ సినిమా గురించి కొన్ని వివరాలను తెలియజేశాడు.

అనిల్ రావిపూడి తాజాగా మాట్లాడుతూ... రామ్ పోతినేని హీరోగా రూపొందిన కందిరీగ సినిమాకు నేను కథను రాసాను. ఇక ఆ సినిమాలో నా కోసం ఒక కామెడీ పాత్రను కూడా రాసుకున్నాను. ఆ పాత్ర మొత్తం రాశాక అందులో నేనే నటించాలి అనుకున్నాను. ఇక చివరకు ఆ పాత్రలో నేను కాకుండా సప్తగిరి నటించాడు. ఆ పాత్ర చాలా బాగా పండింది. దాని ద్వారా సప్తగిరి కి కూడా మంచి పేరు వచ్చింది అని అనిల్ చెప్పాడు. ఇక అనిల్ రావిపూడి, సప్తగిరి నాకు చాలా మంచి స్నేహితుడు.

కానీ నేను అతనితో ఇప్పటివరకు సినిమా చేయలేదు. దానికి ఆయనే కారణం అతనే. ఎందుకు అంటే... నాకు కొంత కాలం క్రితం సప్తగిరి నాకు ఫోన్ చేసి నాకు నీ సినిమాలో పాత్ర రాసావా అని అడిగాడు. దానికి నేను ఆన్సర్ చెప్పే లోపే చిన్న పాత్ర అయితే నేను చేయను. సినిమా మొత్తం ఉండే పాత్ర అయితేనే చెప్పు నేను చేస్తాను లేకుంటే చేయను అని అన్నాడు. దానితో అంత స్కోప్ ఉన్న పాత్ర ఇప్పటివరకు దొరకలేదు.

అందుకే సప్తగిరి నా సినిమాలో ఇప్పటివరకు చేయలేదు. ఏదైనా చిన్న పాత్ర అయినా చేస్తాను అంటే ఇది వరకు నా చాలా సినిమాలలో సప్తగిరి ఉండేవాడు అనిల్ రావిపూడి తాజాగా చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: