సిద్ధార్థ్, అదితిల పెళ్లి.. ఏ గుడిలో జరిగిందో తెలుసా?

frame సిద్ధార్థ్, అదితిల పెళ్లి.. ఏ గుడిలో జరిగిందో తెలుసా?

praveen
సినీ సెలబ్రిటీల ప్రేమ పెళ్లి వ్యవహారాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైనా హీరో హీరోయిన్లు ప్రేమలో కొనసాగుతున్నారు అంటే చాలు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అందరూఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వారి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా ఎప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీ పెళ్లి వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిధిరావు హైదరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉంటున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి  ఇక ఎక్కడి పడితే అక్కడ చట్టాపట్టలేసుకొని తిరుగుతూ ఉండడంతో.. ఈ వార్తలు నిజమే అందరూ ఫిక్స్ అయిపోయారు. చివరికి వీరి ప్రేమ నిజమే అంటూ సోషల్ మీడియాలో ఒప్పేసుకున్నారు ఈ సెలబ్రిటీ జంట. ఇక ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు ఇక ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారు అన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్,అతిథి రావు హైదరి కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల ఆధ్వర్యంలో ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 దక్షిణ భారతదేశపు సాంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ సెలబ్రిటీ జంట ఇక ఆ తర్వాత వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇక ఈ ఫోటోలను చూసి సర్ప్రైజ్ అయిన అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడిలో వీరిద్దరి వివాహం జరిగింది అన్నది తెలుస్తుంది. వనపర్తి లోని ఓ దేవాలయంలో వీరి వివాహం జరిగిందట. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తమ పెళ్లి ఏకంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో చేసుకుంటాము అంటూ హీరోయిన్ అతిథి రావు హైదరి చెప్పింది. ఇక ఇప్పుడు చెప్పినట్టుగానే ఇదే గుడిలో వీరి వివాహం జరిగింది. అయితే రంగనాథ స్వామి ఆలయంతో ఈ హీరోయిన్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే ఇక్కడే నిశ్చితార్థం ఇక్కడే పెళ్లి కూడా జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: