మతం మార్చుకొని రెండో పెళ్లి.. భార్యతో తన్నులు.. జానీ మాస్టర్ అరాచకాలు..?

Pandrala Sravanthi
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరే వైరల్ గా మారుతుంది.ఈయన ఓ మహిళ కొరియోగ్రాఫర్ ని దాడి చేసే లైంగికంగా వేధించాడనే మ్యాటర్ ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ మహిళ ఎవరు.. ఆ మహిళతో జానీ మాస్టర్ కి ఎక్కడ పరిచయం ఏర్పడింది అనేది ఇప్పుడు చూద్దాం.. 2017లో ఢీ విన్నర్ అయినటువంటి మధ్యప్రదేశ్ కు చెందిన శ్రేష్ట  పై మనసు పడిన జానీ మాస్టర్ ఆర్థికంగా సహాయం చేస్తానని నమ్మించి నా దగ్గర అసిస్టెంట్ గా చేయమని చెప్పి 2019 లో శ్రేష్టని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పెట్టుకున్నారట. అలా నమ్మించి  ఓ రోజు షూటింగ్ అని చెప్పి  ముంబై కి తీసుకు వెళ్ళిన సమయంలో బలవంతంగా లైంగిక వేధింపులకు పాలుపడ్డారట.అయితే ఆ మహిళని బలవంతం చేసి లైంగిక వాంఛ తీర్చుకున్నాక ఈ విషయం ఎక్కడైనా చెబితే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తాను అనివార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు ఇలా పలుమార్లు జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారట. 

అంతేకాదు ఓసారి ఒప్పుకోకపోతే తలని అద్దానికేసి బాదారట. అలా చాలాసార్లు జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధించాడని శ్రేష్ఠ ఆ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు ఈ విషయం ఎక్కడైనా బయట చెబితే సినిమాల్లో అవకాశాలు రాకుండా నీ జీవితం మొత్తం నాశనం అయ్యేలా చేస్తాను అని చాలాసార్లు జానీ మాస్టర్ ఆమెను భయపెట్టి బెదిరించి లైంగిక కోరిక తీర్చుకున్నారట. అంతేకాదు శ్రేష్టని మతం మార్చుకొని తనని రెండో పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు వేధించాడట.ఇక ఎన్ని సార్లు చెప్పినా శ్రేష్ఠ వినకపోవడంతో జానీ మాస్టర్ భార్య కి ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ భార్యకి ఈ విషయం చెప్పి శ్రేష్టని పెళ్లికి ఒప్పించమని చెప్పారట.

దాంతో జానీ మాస్టర్ వైఫ్ ఏ భార్య కూడా చేయని పని చేస్తూ తన భర్తని రెండో పెళ్లి చేసుకోమని టార్చర్ చేయడం మొదలు పెట్టిందట. అంతేకాదు వినకపోతే చాలాసార్లు దారుణంగా కొట్టిందట.ఇక ఎన్ని రకాలుగా శ్రేష్టని హింసించిన కూడా ఆమె పెళ్లికి ఒప్పుకోలేదట.దీంతో ఈ టార్చర్ ఇంకా భరించలేను అని శ్రేష్ట వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో జానీ మాస్టర్ బాగోతం కాస్త బయటపడింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: