తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో అత్యంత స్లో గా కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన 2007 వ సంవత్సరం విడుదల అయిన మున్నా సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ... గోవా బ్యూటీ ఇలియానా ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ మూవీ తర్వాత ఈయన తదుపరి మూవీ కి చాలా ఎక్కువగా సమయాన్ని తీసుకున్నాడు. మున్నా సినిమా తర్వాత అత్యంత ఎక్కువ సమయాన్ని తీసుకున్న ఈయన బృందావనం మూవీ ని రూపొందించాడు.
ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత కూడా ఈయన ఎక్కువ గ్యాప్ తీసుకొని ఎవడు , ఆ తర్వాత మరింత ఎక్కువ సమయం తీసుకుని ఊపిరి , ఆ తర్వాత మళ్లీ ఎక్కువ గ్యాప్ తీసుకుని మహర్షి , ఆ తర్వాత వారసుడు సినిమాలను తెరకెక్కించాడు. ఈయన ప్రతి సినిమాకు అత్యంత ఎక్కువ గ్యాప్ ను తీసుకుంటూ వస్తున్నాడు. దానితో 2007 వ సంవత్సరం కెరియర్ను మొదలు పెట్టిన ఈయన ఇప్పటివరకు కేవలం 6 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఈయన ఇంత స్లోగా కెరియర్ను ముందుకు సాగించడానికి ప్రధాన కారణం కేవలం స్టార్ హీరోలతో సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ హీరోలు డేట్ లు ఇచ్చే వరకు ఆగడం వల్ల ఈయన కెరియర్ చాలా స్లో గా ముందుకు సాగుతుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి కొంత మంది ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి.
దానితో ఈయన స్టార్ హీరోల కోసం ఎక్కువ కాలం ఎదురు చూడకుండా తనకు అందుబాటులో ఉన్న హీరోతో త్వరగా సినిమాలు చేస్తే ఈయన కెరియర్ మరింత అద్భుతమైన స్థాయిలో ముందుకు దూసుకు వెళుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలలో చాలా వరకు అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి.