ఆ హీరోని పట్టించుకోని తెలుగు ప్రేక్షకులు !
ఈ మూవీ ద్వారా దిలీప్ ప్రకాష్ అనే కొత్త హీరోను అదేవిధంగా అర్జున్ సాయి అనే కొత్త డైరెక్టర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఈ మూవీ ప్రమోషన్ పై చాల ఎక్కువగానే ఖర్చుపెట్టారు. అయితే ఈ మూవీకి కనీసపు ఓపెనింగ్స్ కూడ రాలేదు. హీరో కొత్తవాడైనప్పటికీ కలర్ ఫుల్ ప్రోమోలు ప్రముఖ నటీనటుల కాస్టింగ్ వల్ల ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావించారు.
కనుమరుగైపోతున్న నాటక కళను కొత్త తరానికి పరిచయం చేసి దానికి పూర్వ వైభవం తీసుకురావడం అనే పాయింట్ చుట్టూ ఒక లవ్ స్టోరీని చెప్పడానికి దర్శకుడు మంచి కథను ఎంచుకుని హిట్ కొట్టాలని ప్రయత్నించినప్పటికీ ఈ సినిమాలో ఒకసీన్ మరొక సీన్ కి ఎక్కడా పొంతన లేకపోవడంతో ఈ సినిమను చూసిన ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాను ఈ మూవీ ద్వారా పరిచయం అయిన దిలీప్ ప్రకాష్ తానే స్వయంగా నిర్మించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణ విలువలకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని తీసినప్పటికీ ఈమూవీ కథ విషయంలో దర్శకుడు కానీ హీరో కానీ ఎక్కడా శ్రద్ధ చూపకపోవడంతో ‘మత్తువదలరా 2’ మూవీకి అన్నివిధాల కలిసి వచ్చింది. ఈ సినిమాకు రివ్యూలు వ్రాసిన వారు మాత్రం ‘ఉత్సవం’ సినిమాను చూసి జనం నీరసపడిపోతున్నారనీ ఈ పరిస్థితులు ‘మత్తువదలరా 2’ కు అదృష్టంగా మారింది అనుకోవాలి..