హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చనిపోయి ఎన్ని రోజులైనా కూడా ఆమె అభిమానులు ఇంకా ఆమె మరవడం లేదు.అంతే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా ఆర్తి అగర్వాల్ నటనని మర్చిపోలేకపోతున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఆమెతో అనుబంధం ఉన్న చాలా మంది ఆర్టిస్టులు,డైరెక్టర్లు, నిర్మాతలు ఆర్తి అగర్వాల్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఆర్తి అగర్వాల్ సన్నబడడం కోసం ఆపరేషన్ చేయించుకొని అది వికటించడంతో మరణించింది.అయితే ఒక రకంగా ఈమె ఆపరేషన్ చేయించుకొని చనిపోవడానికి పరోక్ష కారణం ఓ హీరోయిన్ అంటూ అప్పట్లో ఓ టాక్ వినిపించింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు ఆ హీరోయిన్ ని ఆర్తి అగర్వాల్ ఫాలో అయింది అనేది ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నటీమణులలో ఆర్తి అగర్వాల్ ఒకరు.
ఈమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి స్టార్ నటిగా దూసుకుపోయింది. అయితే ఈమె వెయిట్ కాస్త ఎక్కువే అయినప్పటికీ కూడా అందాలతో అందర్నీ కవ్వించేసింది. ఇక ఈ హీరోయిన్ తరుణ్ తో బ్రేకప్ అయ్యాక పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయింది.కానీ ఆ పెళ్లయిన కొద్ది రోజులకే భర్తతో గొడవలు పెట్టుకుని విడాకులు ఇచ్చేసి ఇండియాకి తిరిగి వచ్చి మళ్ళీ సినిమాల్లో నటించింది. అలాంటి సమయంలో ఆర్తి అగర్వాల్ కి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో అవకాశం వచ్చిందట. కానీ ఆ డైరెక్టర్ మాత్రం నువ్వు ఈ సినిమాలో హీరోయిన్ అవ్వాలంటే కాస్త సన్నబడాలి.
అచ్చం చార్మి లాంటి షేప్ ఉంటే మిమ్మల్ని ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుంటాను అని అన్నారట. దాంతో ఎలా అయినా సరే చార్మిలా తయారవ్వాలి అని వెంటనే హాస్పిటల్ కి వెళ్లి లైపోజిషన్ ఆపరేషన్ చేయించుకుంది. కానీ ఈ ఆపరేషన్ వికటించి ఆర్తి అగర్వాల్ మరణించింది.అలా ఆర్తి అగర్వాల్ చార్మి లాంటి షేప్ రావడం కోసం ఆపరేషన్ చేయించుకొని మరణించిందనే టాక్ ఆ డైరెక్టర్ పేరు ఎక్కువగా వినిపించాయి