ఆ టాలీవుడ్ హీరో కెరీర్ డేంజర్ జోన్లో... ఎంత దారుణం అంటే..?
ప్రస్తుతం అతడు ఓ సినిమా చేస్తున్నాడు. పైకి పెద్ద సినిమా అని చెబుతున్నారు. కానీ.. సగానికి సగం బడ్జెట్ కోత పెట్టారు. వర్కింగ్ డేస్ తగ్గించేందుకు ఆగమేఘాల మీద షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. అన్నింటికన్నా పెద్ద సమస్య ఏంటంటే.. ఇప్పుడు ఆ సినిమాకు బయ్యర్లు దొరకటం లేదు. హీరోకు మంచి బ్యాకింగ్ ఉంది. పైగా మంచి కాంపౌండ్ కూడా ఉంది. ఇప్పుడు ఆ హీరో నటిస్తున్న సినిమా కొనేందుకు బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో ఈ హీరో కొత్త సినిమా కోసం కాంపౌండ్ నుంచి ఎవరో ఒకరు.. హామీగా ముందుకు రావలసిన పరిస్థితి నెలకొంది. నిజానికి సదర హీరో ప్రచారంలో ఉన్న పరిచయాలన్ని బాగా వాడుతారని కమిట్మెంట్ ఉంది.
అయితే ఇప్పుడు ఆ హీరో సినిమాకు బిజినెస్ లో కూడా హామీ కావాలంటున్నారట. ఇది నిజంగా హీరోకు చాలా పెద్ద అవమానకరం అని.. ఒకరకంగా చెప్పాలంటే అతడి కెరీర్‌కు ప్రమాదకర సంకేతాలు పంపుతోందని.. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా సెట్ కాలేదు. అన్నీ పరిచయాలను వాడిన ఎవరు ముందుకు రావడం లేదు. ఇక శాటిలైట్ రైట్స్ సంగతి సరే సరి. ఓవైపు మార్కెట్ ఇలా ఉంటే.. మరోవైపు సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని .. చెబితే కనీసం ఎవరో ఒకరు ఈ సినిమా రైట్స్ కొనేందుకు ముందుకు వస్తారని ఆశతో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది.