టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది దర్శకులు ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకోవడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే రాజమౌళి బాహుబలి 1 , 2 మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలను పాన్ ఇండియా మూవీలుగా విడుదల చేసి మూడింటితో కూడా అద్భుతమైన విజయాలు అందుకొని దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈయన పుష్ప మొదటి భాగంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరికొన్ని రోజులోనే పుష్ప పార్ట్ 2 మూవీ కూడా విడుదల కానుంది. ఇకపోతే కార్తికేయ 2 సినిమాతో చందు మండేటి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ కూడా పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఇక పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ను దక్కించుకోవడానికి మరో ఇద్దరూ టాలీవుడ్ స్టార్ దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొరటాల , త్రివిక్రమ్ వీరిద్దరూ కనుక పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించడంలో సక్సెస్ అయినట్లు అయితే మహేష్ బాబుతో సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు తన తదుపరి మూవీని రాజమౌళితో చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ కి వరల్డ్ వైడ్ గా క్రేజ్ దక్కి అవకాశం ఉంది. దానితో పాన్ ఇండియా సినిమాలను హ్యాండిల్ చేయగలిగే దర్శకులతోనే సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు , దానితో మహేష్ వీరిద్దరూ కనుక పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే విషయంలో సక్సెస్ అయితే వారికే తన నెక్స్ట్ మూవీలను అప్పజెప్పాలి అనే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.