ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో కానున్న రామ్ చరణ్..?

MADDIBOINA AJAY KUMAR
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. మంచి అంచనాలు నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఇకపోతే ఈ సినిమా త్వరగానే పూర్తి అయ్యి విడుదల అవుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కాకపోతే శంకర్ "గేమ్ చేంజర్" కంటే ముందు మొదలు పెట్టిన భారతీయుడు 2 సినిమా షూటింగ్ ఆగిపోయి మళ్ళీ పున ప్రారంభం కావడంతో ఏక కాలంలో శంకర్ ఈ రెండు సినిమాలను పూర్తి చేస్తూ రావడంతో గేమ్ చేంజర్ సినిమా చాలా డిలే అయింది. ఇక ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో గేమ్ చేంజర్ మూవీ ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గేమ్ చెంజర్ సినిమా వల్ల చాలా రోజులు ప్రేక్షకులను పలకరించలేకపోయిన చరణ్ ఈ సినిమా తర్వాత మాత్రం అదిరిపోయే స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు సినిమాలను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ను త్వరగా పూర్తి చేయనున్నట్లు ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కూడా వరస పెట్టి భారీ సినిమాలలో నటిస్తున్న ఆ సినిమాలను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఇలా ప్రభాస్ ఫార్ములా చరణ్ కూడా రాబోయే రోజుల్లో ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: