సల్మాన్ ఇంట్రెస్ట్ సౌత్ పై మామూలుగా లేదుగా.. షారుక్ లాంటి రిజల్ట్ రానుందా..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన దర్శకులు , నటీనటులు బాలీవుడ్ సినిమాలకు పని చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. సౌత్ ఇండస్ట్రీ క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. దానితో బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన నిర్మాతలు , హీరోలు , సౌత్ టెక్నీషియన్స్ తో , నటీనటులతో పని చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. కొంత కాలం క్రితమే బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ సినిమాలో హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీ కు సంబంధించిన నయనతార నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే సల్మాన్ ఖాన్ కూడా షారుక్ రోట్లోనే వెళుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరుగా కెరియర్ను కొనసాగిస్తున్న ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో సికిందర్ అని మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు ఆ పాత్రలో కూడా సౌత్ బ్యూటీనే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో రెండవ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ తీసుకోవాలి అని మూవీ బృందం అనుకున్నట్లు , ఆల్మోస్ట్ ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస పెట్టి సల్మాన్ ఖాన్ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన టెక్నీషియన్స్ ను , నటీ నటులను సికిందర్ మూవీలోకి దించుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా కూడా జవాన్ రేంజ్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: