ట్రైలర్ తో తగ్గిన 'దేవర' హైప్..మంచిదే అంటూ నెటిజన్స్ కామెంట్స్..!!

murali krishna
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్… గతంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్. ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది… కాదు కొత్త రికార్డులు బద్దలుకొట్టే అవకాశం ఉంది… ట్రైలర్ విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ ఉంది.ఫ్యాన్స్ అయితే దేవర రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏ లుక్ వచ్చినా విచ్చలవిడిగా వైరల్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు వణికిపోతున్నారు. కొరటాల మీద కొండంత నమ్మకం పెట్టుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు కొరటాల పేరు వింటే చాలు ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలు ఏంటీ మేటర్ అంటే… ఏదో హైప్ క్రియేట్ చేయాలని చేయడమే గాని ట్రైలర్ లో అంత సీన్ లేదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత కొన్ని గంటలు బాగా స్పీడ్ గా వెళ్ళినా ఆ తర్వాత స్లో అయిపోయింది. కారణం ట్రైలర్ లో ఫ్యాన్స్ ఊహించిన కంటెంట్ లేదు. వినూత్నంగా అయితే ట్రైలర్ లో ఏం కనపడలేదు. ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తే జనతా గ్యారేజ్ డైలాగులు తిప్పి రాసినట్టుగానే కనపడింది. ఎవడేన్ని వాగినా ఫ్యాన్స్ కి సినిమా అనేది పరువుతో సంబంధించిన మేటర్.ఆ పరువు కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తారు. అలాంటి ఫ్యాన్స్ కు ఇప్పుడు దేవర ట్రైలర్ గుండెల్లో గునపం దింపింది. ఆచార్య ట్రైలర్ కు అటు ఇటుగా దగ్గరగా ఉంది దేవర. ఏదో ప్రమోషన్ చేసి జనాల్లో హైప్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నా ట్రైలర్ తో ఫ్యాన్స్ గుండెల్లో వణుకు మొదలయింది.

సినిమా పొరపాటున అటు ఇటు అయితే మాత్రం కొరటాల కెరీర్ ఇబ్బందుల్లో పడ్డట్టే… అసలే… రాజమౌళితో తర్వాతి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ తో ఫ్యాన్స్ కి ఇప్పటికే చెమటలు పడుతున్నాయి. ఆలాంటి సమయంలో వచ్చిన ఈ ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూసిన వాళ్లకు రక్త కన్నీరు కార్చే అవకాశం కనపడుతోంది అని భయపడుతున్నారు.
అయితే ఇలా ఈ సినిమా పట్ల అంచనాలు తగ్గడం ఒక విధంగా మంచిదేనని పలువురు భావిస్తున్నారు.సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొని అదే అంచనాలతో థియేటర్ కి వెళ్లి తిరిగి నిరాశతో వెనక్కి రావడం కంటే ఒక సాధారణ సినిమాని చూడటానికి వెళ్లి మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు రావడం మంచిదని అందుకే ఈ సినిమాకు అంచనాలు తగ్గడమే ఒక విధంగా మంచిదని పలువురు భావిస్తున్నారు. ట్రైలర్ కొంతమేర అభిమానులను నిరాశపరిచిన ఎన్టీఆర్ మాత్రం చివరి 45 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయని ఎవరూ కూడా సీట్లలో కూర్చోరనే విధంగా కామెంట్లు చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందనేది తెలియాల్సి ఉంది.అయితే దేవర' రెండు భాగాలుగా విడుదలవుతోంది. ఈ మొదటి భాగం రన్‌టైమ్ 177 నిమిషాల 58 సెకన్లు. అంటే నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందన్నమాట. ఈ ట్రైలర్ చూసిన అభిమానుల్లో పై అంచనాలు భారీ పెరిగిపోయాయి. 'దేవర' లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుంది. అదేవిధంగా ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న దేవర కు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: