ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్న దేవర యూనిట్.. అందుకే అలాంటి ట్రైలర్..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాలకు భారీ అంచనాలు ప్లస్ కాగా మరికొన్ని సినిమాలకు భారీ అంచనాలు మైనస్ గా మారుతాయి. ఎందుకు అంటే సినిమాలో అద్భుతమైన కంటెంట్ ఉండి ఉంటే దానికి ప్రచారాలను కూడా అదే విధంగా చేసినట్లయితే ప్రేక్షకుల్లో ఎంత స్థాయి అంచనాలు పెరిగిన పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ సినిమాలో కాస్త తక్కువ కంటెంట్ ఉండి భారీ స్థాయిలో సినిమాపై అంచనాలు ఉన్నట్లు అయితే భారీ అంచనాల నడుమ థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు సినిమా ఆ స్థాయిలో లేకపోవడం వల్ల మూవీ కి నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఇకపోతే కొంత మంది ప్లానింగ్ ప్రకారం ప్రేక్షకుల్లో ఎక్కువ అంచనాలు లేకుండా ట్రైలర్లను కట్ చేస్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం దాదాపు రెండు , మూడు నిమిషాలకు నిడివి కలిగిన ట్రైలర్ పెద్ద ఆసక్తిగా లేదు అంటే సినిమా కూడా గొప్పగా ఉండదు అనే ఆలోచనతో ప్రేక్షకులు ధియేటర్లకు వెళ్తారు. ఇక సినిమా మొదలు అయిన తర్వాత ట్రైలర్లో చూపించిన దాని కంటే పెద్ద మొత్తంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ సినిమాలో ఉన్నట్లు అయితే ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర పార్ట్ 1 మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనిని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అత్యంత భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దానితో కొంత మంది ఈ సినిమా ట్రైలర్ గొప్పగా లేదు. సినిమా కూడా గొప్పగా ఉండదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఇది పక్కా స్ట్రాటజీ ప్రకారం జరిగిన విషయం అద్భుతమైన ట్రైలర్ను విడుదల చేస్తే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతాయి.

దాని వల్ల సినిమా కాస్త అటు ఇటు అయినా కూడా నెగటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జనాల్లో అంచనాలు పెద్దగా పెరగకూడదు అనే ఉద్దేశంతో కావాలనే యావరేజ్ ట్రైలర్ను విడుదల చేశారు అని , సినిమాలో కంటెంట్ ఫుల్ గా ఉంటుంది. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి దేవర సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకొని ఏ స్థాయి కలెక్షన్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: