జయం రవి బాటలో మరో హీరో.. విడాకులకు రంగం సిద్ధం..?

Pandrala Sravanthi
గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. చాలామంది చిన్న చిన్న ఇష్యూస్ కి విడాకులు తీసుకుంటున్నారు. రీసెంట్గా జయం రవి,ఆర్తి ఇద్దరి విడాకుల విషయం మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ విషయంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది.కానీ దాన్ని చిలికి చిలికి గాలివానలా చేసినట్టు జయం రవి తొందరపడి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే విడాకులపై ఆర్తి కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.అలాగే కలిసి మాట్లాడాలనుకున్నా కూడా కుదరలేదని చెప్పింది. అంటే జయం రవి కావాలనే విడాకులు ఇచ్చినట్టు ఆర్తి మాటలు చూస్తే తెలుస్తుంది.అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విడాకులు కూడా జరగబోతున్నాయి అంటూ కోలీవుడ్ మొత్తం ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే..స్టార్ హీరో విజయ్ విడాకుల ఇష్యూ గత కొద్దిరోజులుగా విజయ్ తన భార్య సంగీతతో  దూరంగా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. 

ఇక దూరంగా ఉంటున్నారంటే త్వరలోనే విడాకుల గురించి చెప్పి పెద్ద బాంబు పేల్చబోతున్నారని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా విడాకుల విషయం అనౌన్స్ చేసిన జయం రవి,ఆర్తిలు కూడా గత కొద్ది రోజులుగా దూరంగానే ఉంటున్నారట.ప్రస్తుతం విజయ్ సంగీత ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉండడం లేదు.వేరు వేరుగా ఉంటున్నారు. కాబట్టి ఏ క్షణంలో అయినా విడాకులను అనౌన్స్ చేయవచ్చు అంటున్నారు ఆయన అభిమానులు.అంతేకాదు ఈ మధ్యకాలంలో విజయ్ పై మరిన్ని గాసిప్ లు ఇండస్ట్రీలో పెరిగిపోతున్నాయి. ఓవైపు రాజకీయాల్లోకి రాబోతున్న వేళ మరోవైపు ఈయన ఫ్యామిలీ విజయ్ పై పగబట్టి చేసే పనులు మాత్రం ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్నాయి.


 ఓవైపు విజయ్ కి ఇష్టం లేకుండా ఆయన కొడుకు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవబోతున్నాడు. ఇక ఈ విషయంలో పూర్తి పాత్ర సంగీతదేనని తెలుస్తోంది.సంగీత కారణంగానే విజయ్ కి వ్యతిరేకంగా జోసెఫ్ సంజయ్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరి విడాకులు కూడా తథ్యం అని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం విడాకులు తీసుకోకుండా ఇద్దరు కూర్చుని ఈ విషయాన్ని సాల్వ్ చేసుకోవాలని మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇద్దరి మధ్య విషయాన్ని చర్చించుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.మరి నిజంగానే విజయ్ విడాకుల కూడా ఈ విషయాన్ని సడన్గా అనౌన్స్ చేసి ఇండస్ట్రీలో పెద్ద బాంబు పేల్చబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: