కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు అయ్యేవారు ఎక్కువ వయసు కలిగిన వారు ఉండేవారు. దానికి ప్రధాన కారణం ఆ సమయంలో పెద్దగా టెక్నాలజీ లేకపోవడంతో ఎవరో ఒక దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాలు పని చేసి అనేక మేలుకువాలని నేర్చుకొని ఆ తరువాత దర్శకత్వంలోకి దిగేవారు. ఇదంతా జరిగే సరికి వారి వయస్సు ఎక్కువ అయ్యేది. కానీ వయస్సు ఎక్కువ ఉన్న సమయంలో దర్శకుడిగా కెరియర్లు మొదలు పెట్టిన అనేక సినిమాలకు దర్శకత్వం వహించి చాలా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి.
చాలా మంది చిన్న వయసు నుండే దర్శకత్వం చేయాలి అని చెప్పి అనేక దర్శకత్వమేలుకువలను నేర్చుకొని చాలా తక్కువ వయసులోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన ఎక్కువ సినిమాలను చేయడంలో విఫలం అవుతున్నారు. అందుకు ఉదాహరణగా సుజిత్ నిలుస్తాడు. ఈయన అతి చిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు. రన్ రాజా రన్ మూవీ తో సుజిత్ దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ 2014 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా విడుదల అయిన సమయంలో సుజిత్ వయసు చాలా తక్కువ. దానితో అత్యంత చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి ఈయన అనేక సినిమాలు తీసే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
కానీ ఈయన మాత్రం అత్యంత స్లో గా కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. రన్ రాజా రన్ విడుదల అయిన తర్వాత ప్రభాస్ హీరోగా సాహో మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా "ఓజి" మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇలా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు అవుతున్న కేవలం రెండే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సుజిత్ అత్యంత స్లో గా తన కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.