సౌత్ స్టార్ హీరోల్లో
ధనుష్ పేరు కూడా వినిపిస్తుంది.ఈయన చూడ్డానికి సన్నగానే ఉంటారు. కానీ ఈయన సినిమాల్లో మంచి మెసేజ్ ఉంటుంది.
ధనుష్ చేసే ఏ
సినిమా అయినా సరే ప్రేక్షకుల మైండ్ లోకి చొచ్చుకొని పోతుంది. అలాగే
ధనుష్ స్టోరీ నచ్చితేనే ఆ సినిమాలను ఒప్పుకుంటారు. అయితే అలాంటి
ధనుష్ పై ఒక కుర్ర
బ్యూటీ మనసు పడుతున్నట్టు తెలుస్తోంది..
ధనుష్ తో తనకి ఓ కోరిక ఉంది అంటూ
మీడియా తో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టింది.మరి ఇంతకీ
ధనుష్ పై మనసు పారేసుకున్న ఆ
హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
కోలీవుడ్ స్టార్
హీరో ధనుష్ పై మనసు పారేసుకున్న
హీరోయిన్ ఎవరో కాదు ఒకే ఒక్క వీడియోతో నెట్టింట్లో సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ
ప్రియా ప్రకాష్ వారియర్.
కన్ను కొట్టి చేతి వేళ్ళతో గన్ గురిపెట్టి కాల్చినట్టు కాల్చి ఎంతోమంది కుర్ర కారు గుండెల్ని కొల్లగొట్టిన ప్రియ
వారియర్ ఒకే ఒక్క వీడియో తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఆ మధ్యకాలంలో తరచూ
ధనుష్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉండేది. కానీ ఆమె
ధనుష్ ఫోటోలు ఎందుకు పోస్ట్ చేస్తుందో అర్థం కాక చాలామంది కామెంట్లు పెట్టేవారు.
అయితే ఈ విషయాన్ని
మీడియా వాళ్ళు ప్రియని అడగగా నాకు
ధనుష్ అంటే చాలా ఇష్టం ఒక రకంగా ఆయనపై పిచ్చి.. ఆయన తో ఒక్క సినిమాలోనైనా కలిసి నటించాలనే కోరిక నాకు ఉంది. నాకు ఆయనపై అదో మాదిరి ఇష్టం అంటూ
ప్రియా చేసిన కామెంట్లు నెట్టింటి వైరల్ గా మారాయి. ఇక
ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో బ్రో సినిమాలో కూడా నటించింది. ఈమెకి అవకాశాలు లేకపోయినప్పటికీ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని మాత్రం పెంచుకుంటుంది