దేవర తో ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యేనా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు దానికోసమే..?

MADDIBOINA AJAY KUMAR
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించబోతున్నాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు బయటకు రావడం తోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. ఎందుకు అనుకుంటున్నారా ..? జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన కెరీర్లో రెండు సినిమాల్లో తండ్రి , కొడుకు పాత్రలలో నటించాడు.

మొదటగా జూనియర్ ఎన్టీఆర్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రావాలా సినిమాలో తండ్రి , కొడుకు పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన శక్తి సినిమాలో తండ్రి , కొడుకుల పాత్రలో నటించాడు. ఈ సినిమా కూడా అత్యంత భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో తండ్రి , కొడుకుల పాత్రలలో నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో దేవర మూవీ లో కూడా ఎన్టీఆర్ తండ్రి , కొడుకుల పాత్రలలో నటిస్తూ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కాస్త గుబులు మొదలైంది.

మరి ఇప్పటి వరకు దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ప్రచార చిత్రాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మరి ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ఆంధ్రావాలా , శక్తి మూవీల సెంటిమెంట్ ను బ్రేక్ చేసి భారీ విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: