హీరోయిన్ల గురించి అలాంటి విషయం చెప్పిన నాగార్జున.. వెంటనే నేను షాక్.. సునీల్..?

frame హీరోయిన్ల గురించి అలాంటి విషయం చెప్పిన నాగార్జున.. వెంటనే నేను షాక్.. సునీల్..?

MADDIBOINA AJAY KUMAR
నాగార్జున సునీల్ కలిసి చాలా సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సునీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో సునీల్ , నాగార్జున నాకు కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పాడు అని ఆ విషయాలను ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సునీల్ తాజాగా మాట్లాడుతూ ... కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున గారు నాకు ఒక విషయం చెప్పారు. అది ఏమిటి అంటే ... ఒక హీరోయిన్ నాతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఆమె నాతో సినిమా చేయడానికి ఒప్పుకోకపోవడానికి ప్రధాన కారణం మా ఇద్దరి మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్.

ఆ అమ్మాయి కంటే నా ఏజ్ చాలా ఎక్కువ. అందుకే ఆమె నాతో నటించడానికి ఒప్పుకోలేదు. అది నిజంగా వాస్తవం కదా ... సునీల్ ... నాతో ఆ అమ్మాయి సినిమా చేసినట్లు అయితే ఆ తర్వాత ఆ అమ్మాయికి నా వయసు ఉన్న హీరోల పక్కనే అవకాశాలు వస్తాయి. చిన్న హీరోల పక్కన అవకాశాలు రావు. దానితో ఆమె కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. దాని విషయంలో మనం అస్సలు ఫీల్ కాకూడదు. మరి మనం ఎందుకు మనకంటే చిన్న వయసు ఉన్న హీరోయిన్లతో చేస్తున్నాం. ఎవరి ఆప్షన్ వారిది. ఎవరి ఉద్దేశం వారిది. ఎవరికి నచ్చినట్టు వారు చేయాలి. అలాంటప్పుడు మనకు ఎమోషన్స్ బయటకు వస్తాయి. నేను పెద్ద హీరోను కదా ... నా పక్కనే చేయదా అని మనం అసలు అనుకోకూడదు. ఎవరి పరిస్థితులను బట్టి వారు సినిమాలు చేస్తారు. నేనెందుకు నా కెరియర్ బిగినింగ్ లో చేసిన హీరోయిన్లతో సినిమాలు చేయడం లేదు.

ఎవరి ఆప్షన్స్ వారికి ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వారు చేయొచ్చు అని ఒక సందర్భంలో నాగార్జున నాకు చెప్పాడు అని సునీల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే సునీల్ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రల్లో నటించి , ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. ఇక ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో కామెడీ పాత్రల్లోనూ,  విలన్ పాత్రలలనూ , ఇతర ముఖ్య పాత్రలలోనూ నటిస్తూ కెరియర్ను మంచి జోష్లో ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: