చీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైస్వాల్..!

frame చీర కట్టులో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రగ్యా జైస్వాల్ , అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించలేదు. దానితో ఈమెకు ఈ మూవీ ద్వారా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈమె కంచే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం వల్ల ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు బాగానే వచ్చింది. గుర్తింపు వచ్చింది కానీ ఆ తర్వాత ప్రగ్య కి భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రాలేదు. అవకాశాలు వచ్చిన ఆ సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు.
 

దానితో ఈమె చాలా సంవత్సరాల పాటు కెరియర్ను డల్ గానే కొనసాగించింది. అలాంటి సమయంలోనే ఈమె బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ పాస్టర్ విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది.  ప్రస్తుతం ఈ నటి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే "అఖండ 2" సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస హిందీ సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం కెరీయర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ నటి సినిమాలలో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఓలకబోస్తోంది.
 

అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రగ్య అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ శారీని కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ లుక్స్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: