కొరటాల కెరీర్ డేంజర్‌జోన్ లోనే.. ' దేవర ' పై ఆ డిజాస్టర్ ఎఫెక్ట్.. !

RAMAKRISHNA S.S.
కొరటాల శివ ఒకప్పుడు టాలీవుడ్ లో తిరుగేలేని స్టార్ డైరెక్టర్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ హిట్లు కొడుతూ కొరటాల టాలీవుడ్ లో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నరు. మహేష్ బాబుతో రెండు సూపర్ హిట్లు, ఎన్టీఆర్ తో ఒక సూపర్ హిట్.. ప్రభాస్‌తో ఒక సూపర్ హిట్ సినిమా తీశాక కొరటాల క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. కొరటాలతో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న‌ పరిస్థితి. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల ఆచార్య సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి స్వయంగా కొరటాలని పిలిచి సినిమా చేయాలని ఉందని చెప్పడంతో ఆచార్య సినిమాను తెరకెక్కించారు.

అయితే ఎందుకోగాని ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం ఎదురవుతూ వచ్చింది. చిరంజీవి, కొరటాల శివ సినిమా అంటేనే అదిరిపోతుందని అందరూ భావించారు. అయితే సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయింది. అటు చిరంజీవి కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్ అవడంతో పాటు.. ఇటు కొరటాల శివ ఇమేజ్‌ పూర్తిగా డ్యామేజ్ చేసేశింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ పై చాలా చర్చలు నడిచాయి. ఇది కొరటాల టేకింగ్ కాదని.. సినిమా మొత్తం చిరంజీవితో పాటు.. మెగా కాంపౌండ్.. చిరంజీవి చుట్టూ ఉన్నవాళ్లే ఇష్టానుసారం కథలో మార్పులు, చేర్పులు చేసి తీసి తీసి పడేసారని అందుకే అతి పెద్ద డిజాస్టర్ అయిందన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపించాయి.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న దేవర సూపర్ డూపర్ హిట్ అయితే.. కొరటాల కెరీర్ కు తిరుగేఉండదు. ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టిన కొరటాల క్రేజ్‌ పూర్తిగా పడిపోతుంది. ఓవర్సీస్ లో అయితే ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ దేవరపై ఏమాత్రం ఉన్నట్టు కనిపించడం లేదు. దేవర ఇప్పటికే అక్కడ వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ దాటేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఆచార్య ఎఫెక్ట్ దేవరపై ఎంతవరకు ఉంటుంది అన్నది ఇప్పటికైతే చెప్పలేము. కానీ ఇప్పటివరకు ఆ ప్రభావం అంతగా ఉండేలా లేదు. ఏది ఏమైనా దేవర ఇటు ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌కు అటు కొర‌టాల‌ శివ కెరీర్‌కు ఎంతో ఇంపార్టెంట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: