యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా . . సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇకపోతే ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కాటుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. మొదటి నుండి ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండడం , అలాగే ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ లో కూడా ఎక్కువ శాతం యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో ఈ మూవీ కి "ఏ" సర్టిఫికెట్ వచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అని పలువురు జనాలు అభిప్రాయపడ్డారు.
కానీ ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తుంది. దానితోనే అర్థం అవుతుంది ఈ సినిమా ప్రచార చిత్రాల్లో , ట్రైలర్ లో భారీ రక్తపాతం , యాక్షన్ సన్నివేశాలు కనిపించిన సినిమాలో ఎక్కువ శాతం డ్రామానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏ స్థాయి విజయాన్ని అందుకొని , ఏ రేంజ్ క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకుంటాడో చూడాలి.