టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న స్టార్ డైరెక్టర్ కూతురు ..

Suma Kallamadi
యాక్ట్రెస్ అదితి శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యింది. అదితి కోలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అయిన శంకర్‌కు రెండో కూతురు. ఎంబీబీఎస్‌ చదువుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలో రాణించాలని చిన్నప్పటి నుంచి అనుకునేదట. అందుకే ఎంతో గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిని కూడా వదిలేసింది.
కార్తీక్ హీరోగా నటించిన "విరుమాన్" సినిమాతో అదితి హీరోయిన్ తమిళనాడు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. మొదటి సినిమాలోనే చాలా బాగా నటించి మంచి క్రియేట్ తెచ్చుకుంది. అనంతరం నటుడు శివకార్తికేయన్‌తో కలిసి ఒక సినిమా చేసింది. అదితి మంచి యాక్టర్ మాత్రమే కాదు సింగర్ కూడా తను నటించిన రెండు సినిమాల్లోనూ పాటలు పాడే తన టాలెంట్ చూపించుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది ఏం పైగా బాగా యాక్ట్ చేస్తుంది అందుకే ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. వాటిలో మంచివి సెలెక్ట్ చేసుకుని ఈ తార ఇప్పుడు బిజీగా కడుపుతోంది. అదితి తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెట్టనుందని, అది కూడా హీరోయిన్‌గా అని ఫిలిం సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
అదితి సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు తన తండ్రి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, టెక్నికల్ అసిస్టెంట్‌గా వర్క్ చేసింది. ఆ సమయంలో ఎలా తీస్తారో పూర్తిగా అవగాహన పెంచుకుంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు విజయ్ కనకమడెల ఓ సినిమా తీయబోతున్నాడు. అందులో ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుందని టాక్.
అదితి తమిళనాడులో పుట్టి పెరిగిన తెలుగు బాగా నేర్చుకుంది. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు కూడా అందుకే ఆమెకు ఇక్కడ అవకాశాలు వస్తున్నాయని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ తార ఫస్ట్ తెలుగు సినిమాతో హిట్ కొడితే ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఆమె సినిమాల్లో క్లిక్ అయితే శంకర్ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోయినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: