దేవర క్లైమాక్స్ లీక్.. అసలు మేటర్ ఏంటంటే..!?

Anilkumar
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన సినిమాల్లో దేవర ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్  దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. దేవర సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించగా షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ లతో పాటు శ్రీకాంత్ తదితరులు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ సినిమాకు మరింత ఆకర్షణను

 జోడిస్తుంది. కొరటాల శివ తనదైన స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ సీన్లు, ఎమోషనల్ సన్నివేశాలు, కామెడీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది అని చెప్పవచ్చు. దేవర సినిమా సెప్టెంబర్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు సోషల్ మీడియా నీ షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో ఎన్టీఆర్ యాక్షన్ అవతారం, కథలోని కొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.  ఇది ఇలా ఉంటే  ఇప్పటివరకు బయటకు వచ్చిన దేవర ప్రమోషనల్ కంటెంట్

 అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే దేవర పార్ట్ 1 క్లైమాక్స్ పై ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే మొదటి పార్ట్ 1కు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సినిమాల క్లైమాక్స్ లు ఒక ఎత్తు అయితే దేవర క్లైమాక్స్ మరో ఎత్తు అని తెలుస్తోంది. యాక్షన్ అభిమానులకు ఈ సినిమా క్లైమాక్స్ ఓ ఫీస్ట్ అట. ముఖ్యంగా దేవర ఊచకోతకు వెన్నులో వణుకు పుడుతుందని, బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల సునామీ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు.  ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: