ది గోట్: స్పెషల్ సాంగ్ కి త్రిష రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాకె..!

Divya
కోలీవుడ్ టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించిన వారిలో త్రిష కూడా ఒకరు. ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ తన అందంతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన త్రిష 40 ఏళ్లు అయినప్పటికీ కూడా ఇప్పటికి వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటూ అంతే అందాన్ని మెయింటైన్ చేస్తోంది. కుర్ర హీరోయిన్లకు దీటుగా ఫిజిక్ తో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే త్రిష తన కెరియర్ లో ఎప్పుడూ కూడా స్పెషల్ సాంగ్లు నటించలేదు. కానీ ఇటీ వలె విజయ్ దళపతి నటించిన దిగోట్ సినిమాలో నటించింది వాటి గురించి చూద్దాం.

2004లో విజయ దళపతి సరసన గిల్లి అనే చిత్రంలో నటించింది ఈ చిత్రం మంచి విజయం అందుకోవడం వల్ల అప్పటినుంచి ఈ జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత వీరి  కాంబినేషన్లు అడుగు, ఆది, తిరుపాచ్చి చిత్రాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి. 2023లో లియో సినిమాలో కూడా ఈ జంట నటించి భారీ విజయాన్ని అందుకున్నది. ఇటీవల డైరెక్టర్ వెంకట ప్రభు డైరెక్షన్లో గోట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నది.అంతేకాకుండా ఇందులో చాలా మంది నటీనటులు నటించారు.

మట్ట పాటలో నటి త్రిష తో కలిసి విజయ్  కలిసి డాన్స్ వేయడం జరిగింది. గిల్లి సినిమాలోని ఈ పాటను రీమిక్స్ చేయడం వల్ల అందరిని ఆకట్టుకున్నది. విజయ్ 69వ సినిమాలో త్రిష నటించకపోతే.. అయితే గోట్ సినిమాలో మట్ట పాటకు త్రిష తీసుకున్న రేమ్యునరేషన్ గురించి ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ సినిమాలోని పాట కోసం ఏకంగా రూ .2కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సమంత కూడా పుష్ప సినిమాలోని పాటకు రూ .3కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిబట్టి చూస్తే విజయ్ కోసమే త్రిష రెమ్యూనరేషన్ తగ్గించుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: