గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలు వరదల వల్ల బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. దానితో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎంతో మంది నటీనటులు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పెద్ద మొత్తంలో విరాళాలను అందించారు. మరి ఎవరు ఎంత విరాళాలను ఇచ్చారు అనే వివరాలను తెలుసుకుందాం.
కొణిదెల నిహారిక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదు లక్షల విరాళాలను ప్రకటించింది. యాంకర్ స్రవంతి చొక్కారపు 1 లక్ష రూపాయల విరాళాలను రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ 6 కోట్ల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చాడు. అనన్య నాగళ్ళ 5 లక్షల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించింది. ప్రభాస్ రెండు కోట్ల రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించాడు. బాలకృష్ణ ఒక కోటి రూపాయలను , మహేష్ బాబు ఒక కోటి రూపాయలను , చిరంజీవి ఒక కోటి రూపాయలను , అల్లు అర్జున్ ఒక కోటి రూపాయలను , అక్కినేని ఫ్యామిలీ ఒక కోటి రూపాయలను , రామ్ చరణ్ ఒక కోటి రూపాయలను , దగ్గుపాటి రానా ఒక కోటి రూపాయలను రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు.
ఇక త్రివిక్రమ్ మరియు చిన్నబాబు 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించగా , వైజయంతి మూవీ సంస్థ 45 లక్షల రూపాయలను , సిద్దు జొన్నలగడ్డ 30 లక్షల రూపాయలను , విశ్వక్ సేన్ పది లక్షల రూపాయలను , వెంకీ అట్లూరి పది లక్షల రూపాయలను , సాయి దుర్గ తేజ 25 లక్షల రూపాయలను , వరుణ్ తేజ్ 15 లక్షల రూపాయలను , మైత్రి మూవీ సంస్థ 50 లక్షల రూపాయలను , దిల్ రాజు 50 లక్షలు , సోనూసూద్ అత్యవసర వస్తువులను సప్లై చేస్తున్నాడు. అంబికా కృష్ణ పది లక్షలు , తెలుగు ఫిలిం ఛాంబర్ 50 లక్షలు , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ 20 లక్షలు , తెలుగు ఫిలిం ఫెడరేషన్ 10 లక్షలు , ఆయ్ మూవీ నిర్మాణ సంస్థ కొంత షేర్ కలక్షన్లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.