సినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి అయిన దర్శకత్వం వహించిన మొదటి సినిమాతో మంచి విజయం దక్కితే అతను రెట్టింపు ఉత్సాహంతో మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ముందుకు దూసుకు వెళుతూ ఉంటాడు. ఇక ఎంతో అంచనాల నడుమ బ్లాక్ బస్టర్ విజయం సాధించాలి అనే కసితో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన దర్శకులకు దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కితే కొంత మంది దర్శకులు కాస్త ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన దర్శకుడుగా కెరియర్ను కొనసాగిస్తున్న వంశీ పైడిపల్లి కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకానొక సందర్భంలో పడినట్లు తెలుస్తోంది.
కొన్ని సంవత్సరాల క్రితం వంశీ పైడిపల్లి , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాతగా మున్నా అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీతోనే ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఇకపోతే మున్నా సినిమా గురించి ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు ఒక సందర్భంలో మాట్లాడుతూ ... విడుదలకు ముందు మున్నా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకున్నాము. కానీ విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి అలాంటి రెస్పాన్స్ రాలేదు. దానితో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో వంశీ చాలా డిసప్పాయింట్ అయ్యాడు.
చాలా లో అయ్యాడు. దానితో నేను అతనికి ఒకే మాట చెప్పాను. మనం కథ విషయంలో కొన్ని పొరపాట్లు చేసి ఉంటాము. కానీ నువ్వు సినిమాను బాగా తీశావు. నీ సైట్ నుండి ఏ తప్పు లేదు. నెక్స్ట్ మంచి కథను రెడీ చేసుకో. మళ్లీ సినిమా చేద్దాం అన్నాను. ఆ తర్వాత ఆయన చాలా మంది రైటర్స్ తో కలిసి బృందావనం కథను రెడీ చేసుకున్నాడు. దానిని రూపొందించడం అది సూపర్ సక్సెస్ కావడం జరిగింది అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.