ఏదైనా సినిమా విజయంలో ఎడిటర్ చాలా కీలక పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలో దర్శకులు అనేక సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని పాటలను , యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక ఎడిటర్ అనే వారు లాస్ట్ లో ఎంట్రీ ఇచ్చిన కూడా సినిమాకు ఏది అవసరం , ఏది అవసరం లేదు. సినిమాలో ఉన్న కథకు ఎంత రన్ టైమ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా అనేక విషయాలను వారు కరెక్ట్ గా చూస్తూ ఉంటారు. దానితో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన కూడా ఎడిటర్ సినిమా యొక్క రిజల్ట్ ను మొత్తం గా మార్చివేసే అవకాశం ఉంటుంది.
ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఎడిటర్ లలో మార్తాండ్ కే వెంకటేష్ ఒకరు. ఈయన తన కెరియర్ లో చాలా సినిమాలకు ఎడిటింగ్ చేశాడు. ఇకపోతే ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చాలా సినిమాలకు కూడా పని చేశాడు. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. మార్తాండ్ కే వెంకటేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి మూవీ కి ఎడిటర్ గా పని చేశాను.
ఇక ఆ సినిమా ఎడిట్ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ... ఈ సినిమా ఆడడం కష్టం సార్. ఇందులో స్టోరీ ఏముంది. ఇది జనాలను ఆకట్టుకోవడం చాలా కష్టం అని చెప్పాను. దానితో పవన్ ఇందులో కొత్త పెద్దగా కథ లేకపోయి ఉండొచ్చు. కానీ స్క్రీన్ ప్లే బాగుంది. పాటలు బాగున్నాయి. ఇతర అంశాలు బాగున్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది వెంకటేష్ అని పవన్ నాతో అన్నాడు. ఇక పవన్ చెప్పినట్లే బద్రి సినిమా మంచి విజయం సాధించింది అని ఆయన చెప్పుకొచ్చాడు.