ఓటిటిలో విక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీ తంగలాన్.. ఎప్పుడంటే..?

frame ఓటిటిలో విక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీ తంగలాన్.. ఎప్పుడంటే..?

Divya
థియేటర్లో విడుదలైన చాలా సినిమాలు ఒక నెల వ్యవధిలోనే ఓటిటీ లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా కూడా ఓటీటీ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న తర్వాత సీక్వెల్స్ ని థియేటర్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గత నెలలో విడుదలైన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బ్లాక్ బస్టర్ విజయం గా అందుకున్న మరొక చిత్రం ఓటీటిలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం ఏదో కాదు కోలీవుడ్ లో సూపర్ హిట్టుగా పేరుపొందిన తంగలాన్ చిత్రం. ఈ సినిమాలో హీరోగా చియాన్ విక్రమ్ నటించారు. డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహించారు. కీలకమైన పాత్రలో మాళవిక మోహన్ నటించింది.

ఇందులో విక్రమ్ విభిన్నమైన గెటప్పులలో ప్రేక్షకులను బాగా అలరించారు. అందుకే తంగలాన్ సినిమా విడుదలైన అన్ని భాషలలో కూడా  మంచి విజయాన్ని అందుకున్నది. ఈ చిత్రం గత నెల ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా కోలార్ బంగారు గని తమిళుల విషాద సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు కూడ అద్భుతంగా నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.

ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. థియేటర్లో సక్సెస్ ఫుల్ గా పేరు పొందిన ఈ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ గురించి ఒక న్యూస్ ఇప్పుడు వినిపిస్తోంది. తంగలాన్ ఓటీటీ సినిమా రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం సెప్టెంబర్ చివరి వారంలో తంగలాన్ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారట. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: