విజ‌య్ ' ది గోట్ ' సినిమాపై అదిరిపోయే సెటైర్‌.. ఇంత‌క‌న్నా మంచి టైటిల్ ఉండ‌దేమో..!

frame విజ‌య్ ' ది గోట్ ' సినిమాపై అదిరిపోయే సెటైర్‌.. ఇంత‌క‌న్నా మంచి టైటిల్ ఉండ‌దేమో..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
కోలీవుడ్ స్టార్ హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి హీరోగా వ‌చ్చిన సినిమా ది గోట్‌. వెంక‌ట్ ప్ర‌భు తెర‌కెక్కించిన ఈ సినిమాలో స్నేహ‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లు కాగా.. త్రిష కూడా ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. ఇక విజ‌య్ త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఇదే చివ‌రి సినిమా అంటూ ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ సినిమా తొలి ఆట‌కే దిమ్మ‌తిరిగే నెగ‌టివ్ టాక్ తెచ్చుకుంది. ఇదేం సినిమా రా బాబు అంటూ జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఇక సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమా ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ఘోరంగా అంటే ఘోరంగా విఫలం అయ్యారు. అక్కడ అక్కడ యాక్షన్ సన్నివేశాల్లో కొంత పర్వాలేదు అనుకున్నా .. మొత్తం మీద చూస్తే సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోదు. తండ్రి పాత్ర పోషించిన విజయ్ కు జోడిగా స్నేహ నటిస్తే...యువ విజయ్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటించింది. మీనాక్షి చౌదరి పాత్రకు కు ఈ సినిమా లో ఏ మాత్రం ప్రాధాన్య‌త లేకుండా పోయింది.

ఇక సినిమా చూసిన ఓ నెటిజ‌న్ అయితే టైటిల్ గొప్ప‌గా.. సినిమా చ‌ప్ప‌గా ఉంద‌ని కౌంట‌ర్ వేశాడు. టైటిల్ మాత్రం చాలా గొప్ప‌గా భారీగా ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం(గోట్) అని పెట్టి ప్రేక్షకులను బకరాలు చేశారు అంటూ విమ‌ర్శ‌లు చేశారు. చాలా సైట్లు... అందులోనూ త‌మిళ మీడియా వాళ్లే ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వ‌డ‌మే ఎక్కువ అన్న‌ట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇక తెలుగులో గోట్ సినిమా గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: