నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్ హీరోలు.. డబ్బు పిచ్చితో ఎంతకి తెగిస్తున్నారంటే..?

frame నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న టాలీవుడ్ హీరోలు.. డబ్బు పిచ్చితో ఎంతకి తెగిస్తున్నారంటే..?

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం టాలీవుడ్ లో నిర్మాతలు.. హీరోలు, దర్శకులు.. హీరోల మధ్య ఏమాత్రం అనుబంధం ఉండటం లేదు. ఎవరికి వారు తమకు ఎంత డబ్బు ఇస్తారు..? ఎన్ని రోజులు షూటింగ్ చేయాలి..? అంతవరకే చూసుకుంటున్నారు తప్ప.. కథ ఏమిటి..? కాకరకాయ ఏమిటి..? సినిమా హిట్ అవుతుందా..? తమ కెరీర్‌కు ఉపయోగపడుతుందా..? తమ మార్కెట్ పెంచుతుందా..? సినిమా తీసిన వారికి కొన్నవారికి లాభాలు వస్తాయా..? ప్రేక్షకులు ఈ సినిమాకి ఎంజాయ్ చేస్తారా..? అన్నది అస్సలు పట్టించుకోవడం లేదు.

హీరోలు డబ్బులు తీసుకునే విషయంలో అస‌లు మొహమాట పడటం లేదు. వారికి కావాల్సింది డబ్బు మాత్రమే.. సినిమా కొని ఎవరు ఎలా పోయినా..? ఎంత నష్టపోయిన..? ప్రేక్షకులు తిట్టుకున్న తమకేం సంబంధం లేదు అన్నట్టుగా హీరోలు వ్యవహరిస్తున్నారు. ఓ మాస్ హీరో ఉంటాడు.. తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇస్తే కానీ.. సినిమా షూటింగ్ సరిగా చేయడని నిర్మాతలకు చుక్కలు చూపించేస్తారు అన్న ప్రచారం ఉంది. ఆయన సినిమాలు వ‌రుస పెట్టి డిజాస్టర్లు అవుతున్న ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నిర్మాతలు సైతం ఆ హీరోతో ఎందుకు సినిమాలు చేస్తున్నారో..? ఎవరికి అర్థం కావడం లేదు.

ఆ హీరో ఇటీవ‌ల త‌న రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌క‌పోతే డ‌బ్బింగ్ చెప్ప‌న‌ని మొండి కేయ‌డంతో నిర్మాత గ‌త్యంత‌రం లేక బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చుకుని సెటిల్ చేసుకున్నారు. అదే మాస్ హీరో ఓ సినిమాకు కాస్త ఎక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఆ విష‌యం తెలుసుకుని.. మ‌రో రు. 2 కోట్లు అద‌నంగా లాగేశార‌ట‌. ఇక ఇప్పుడు అదే బాట‌లో మ‌రో మాస్ హీరో కూడా చేస్తున్నాడ‌ట‌. అస‌లు ఆ హీరోకు హిట్టే లేదు. ఓ పేరున్న పెద్ద నిర్మాణ సంస్థ సినిమా తీస్తోంది. అత‌డితో సినిమా తీయ‌డ‌మే ఎక్కువ‌. అలాంటిది ఆ హీరో అలా చేయ‌డంతో చివ‌ర‌కు అప్ప‌టిక‌ప్పుడు ఆ నిర్మాత ఫైనాన్స్ సంస్థ నుంచి అత‌డికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే కాని షూటింగ్‌కు రాలేద‌ట‌. ఇలా టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు డ‌బ్బుకోసం క‌క్కుర్తి పడుతూ నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: