పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా..?

frame పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నది ఎవరో తెలుసా..?

Suma Kallamadi
సినిమా రంగంలో, రాజకీయాలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్యుల నుంచి అగ్రతారల వరకు అందరూ కూడా పవన్ అంటే ఇష్టపడుతుంటారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికి లేదు. ఇండస్ట్రీలోని చాలామంది అభిమానులు ఉన్నారు అంతేకాకుండా సామాన్య ప్రజలు అభిమానానికి అవధులు లేవు. ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అయిన తర్వాత.... అప్పట్లో పవన్ అభిమానులు అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ అనేక విధాలుగా వారి అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్ విపరీతంగా అభిమానించే అభిమానులలో జానీ మాస్టర్ కూడా ఒకరు. ప్రముఖ డాన్స్ రియాల్టీ షో ఢీతో ఎంతో మంచి పేరు సొంతం చేసుకొని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలు హీరోలకే కాదు కన్నడ, తమిళ్ బాలీవుడ్ హీరోలకు కూడా ఇతను కొరియోగ్రాఫర్‌గా వహించారు. అయితే ప్రస్తుతం సోనీ మాస్టర్ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది. 

ఆ ఫోటో ఏమిటంటే పవన్ కళ్యాణ్ నటించిన బాలు సినిమా సెట్ లోనిది.. 2009లో నితిన్ నటించిన ద్రోణ సినిమాతో డాన్స్ మాస్టర్ గా అడుగుపెట్టిన జానీ మాస్టర్ అనంతరం రామ్‌ చరణ్‌తో రచ్చ, నాయక్‌, ఎవడు, రంగస్థలం, అల్లు అర్జున్‌తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో, యంగ్‌ టైగర్‌తో ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్‌, నాన్నకు ప్రేమతో అరవింద సమేత వీర రాఘవ, రామ్‌ పోతినేనితో ఇస్మార్ట్‌ శంకర్‌ లాంటి సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేశారు.


 
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా అభిమానించే ఈ జానీ మాస్టర్ జనసేన పార్టీలోకి చేరారు.. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా జనసేన పార్టీ తరఫున ప్రచారం కూడా నిర్వహించారు.. అయితే కాకుండా ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 1000 మందితో రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: